Home > సినిమా > తికమక తాండలో ఏం జరిగింది..?

తికమక తాండలో ఏం జరిగింది..?

తికమక తాండలో ఏం జరిగింది..?
X

కొత్తగా వచ్చేవాళ్లంతా కొత్త కంటెంట్ తోనే వస్తుంటారు. వాళ్ల కంటెంట్ కు కాస్త యూనిక్ లుక్ వస్తే ఖచ్చితంగా కమర్షియల్ గానూ మంచి విజయాలు సాధిస్తాయి. ప్రస్తుతం తెలుగులో ఈ తరహా కొత్తదనం ఉన్న కథలకు ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో అత్యంత సహజమైన కథ, కథనాలతో కనిపిస్తోన్న సినిమా ‘తికమక తాండ’. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను దర్శకుడు విక్రమ్ కుమార్ చేతుల మీదుగా సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. ఈ నెల 15న విడుదల కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. రామకృష్ణ, వెంకట్, హరికృష్ణ, ఆనీ, రేఖ నిరోషా, శివ నారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరిలో రాజన్న ఫేమ్ ఆనీ హీరోయిన్ గా నటించింది.

ఒక చిన్న ఊరు.. కల్మషం లేని మనుషులు.. వారిలో వారికే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్.. అందుకోసం ఏర్పాటు చేసుకున్న పలకలు.. ఇలా ఓ కొత్త సెటప్ తో స్టార్ట్ అయింది ట్రైలర్. ఓ యువజంట ప్రేమకథతో మొదలై.. ఆ తర్వాత ఊర్లోని గుడిలో దేవుడి విగ్రహం మాయం కావడం.. అది దొంగిలించిన వాడిని పట్టుకునేందుకు హీరో ప్రయత్నించడం.. దీని వెనక ఇంకేదో తెలియని ఓ పెద్ద ముఠా ఉండటం అనే పాయింట్ ఆకట్టుకునేలా ఉంది. మొదట సాఫ్ట్ గా కనిపించినా.. తన ప్రేమకోసం.. గుళ్లో దేవుడి విగ్రహం కోసం మాస్ గా మారే హీరోతో ఈ ట్రైలర్ కనిపిస్తోంది.

మొత్తంగా ట్రైలర్ చూస్తే చాలా నేచురల్ గా ఉంది. ఎక్కడా సినిమాటిక్ లిబర్టీస్ ను ఎక్కువగా తీసుకున్నట్టు లేదు. ఆర్టిస్టులంతా తెలిసినవాళ్లే కావడం మరింత ప్లస్ అవుతోంది. యంగ్ హీరోగా నటించిన రామకృష్ణ సినిమా టైటిల్ కు తగ్గట్టుగా గ్రామీణ యువకుడుగా నేచురల్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ తరహా టైటిల్స్ ఆకట్టుకుంటాయి. ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్ కనిపిస్తోంది. కాస్త మౌత్ టాక్ కూడా యాడ్ అయితే.. తికమక తాండా కమర్షియల్ గా ఏ కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళుతుందని చెప్పొచ్చు.

Updated : 4 Dec 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top