కొత్తసాంగ్‌తో వచ్చేసిన మృణాల్, విజయ్..‘మధురము కదా..’
X
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరశురామ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. బడా నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. అవన్నీ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
ఫ్యామిలీ మ్యాన్‌గా విజయ్ నటించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి మూడో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను శ్రీమణి రాయగా శ్రేయా ఘోషల్ ఆలపించారు.
గోపి సుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఖుషీ మూవీలో సమంతతో ఆడిపాడిన విజయ్..ఈ మూవీలో మృణాల్‌తో డ్యూయెట్ పాడనున్నారు. తాజాగా విడుదలైన మెలోడీ సాంగ్‌లో మృణాల్, విజయ్ క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.