Home > సినిమా > నా గ్లామర్ సీక్రెట్ ఇదే..మిల్కీ బ్యూటీ

నా గ్లామర్ సీక్రెట్ ఇదే..మిల్కీ బ్యూటీ

నా గ్లామర్ సీక్రెట్ ఇదే..మిల్కీ బ్యూటీ
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, మిల్కీ బ్యూటీ తమన్నా ఇటు సౌత్‎లో అటు నార్త్‎లోనూ వరుసగా క్రేజీ ప్రాజెక్టులను చేస్తూ ఫ్యాన్స్‎ను ఉర్రూతలూగిస్తోంది. తన నటనతో పాటు అందంతో సినీ అభిమానుల హృదయాలను దోచేస్తోంది. అందం తిన్నదా అన్నట్లుగా ఉండే ఆమె గ్లామర్ కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తున్నాయి. ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా ఆమె నిత్యం తనను తాను తెరముందుకు కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకు తగ్గ ప్రతిఫలం కూడా అందుకుంటుంది. వయసు 33 ఏళ్లు అయినా ఇప్పటికీ స్వీట్ 16 ఆమె మేని ఛాయ మెరిసిపోతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తలైవ, సూపర్ స్టార్ రజనీకాంత్‎తో జోడీ కట్టి జైలర్ సినిమాతో భారీ హిట్‎ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో తన అందాలతో ప్రేక్షకులు మైమరిచేలా చేసింది తమన్నా. అంతే కాదు నువ్ కావాలయ్యా.. అనే పాటతో ప్రపంచాన్నే షేక్ చేసేసింది.

అయితే తాజాగా తమన్నా తన బ్యూటీ సీక్రెట్‎ను అభిమానులతో పంచుకుంది. ఈ మధ్య జరిగిన ఓ ఒక ఇంటర్వ్యూలో గ్లామర్‌ ఇండస్ట్రీలో హీరోయిన్‎గా ఫిట్‎గా ఉండడం చాలా అవసరం అని చెప్పింది. అందుకు తనను తాను బెస్ట్‎గా చూపించేందుకు శారీరక కసరత్తులకు ప్రయారిటీ ఇస్తానని తెలిపింది. ఫిజికల్ ఫిట్‎నెస్‎తో పాటు ఫుడ్ హాబిట్స్‎కి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పింది.

తనను తాను ఫిట్‎గా అందంగా ఉంచుకునేందుకు ఫుడ్ విషయంలో చాలా కేర్‏గా ఉంటానని చెప్పకొచ్చింది తమన్నా." ప్రతి రోజు ఉదయం లేవగానే నట్స్, డేట్స్, అరటి పండ్లను సమానంగా తీసుకుంటాను. మధ్యాహ్నం లంచ్‎లో బ్రౌన్‌ రైస్, పప్పు, వెజిటేబుల్స్ తీసుకుంటాను. అయితే సాయంత్రం 5.30 గంటలకే నా డిన్నర్‌ పూర్తవుతుంది. ఆ తరువాత మళ్లీ మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తినను. ఇలా ప్రతి రోజు 12 గంటలు ఎలాంటి ఆహారం తీసుకోను. ఇలా చేయడం వల్ల స్కిన్ ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. వీటితో పాటే గ్రీన్‌ టీ, ఆమ్లాజ్యూస్‌ వంటివి తీసుకుంటాను. ఇవి ఆరోగ్య రహస్యంలో ఒక భాగం" అని మిల్కీ బ్యూటీ తన బ్యూటీ సీక్రెట్‎ను రివీల్ చేసింది.

Updated : 27 Aug 2023 11:10 AM IST
Tags:    
Next Story
Share it
Top