Rakesh Master: రాకేశ్ మాస్టర్ చివరి కోరిక.. అదొక్కటే శాశ్వతం..
X
టాలీవుడ్ కొరియోగ్రఫర్ రాకేశ్ మాస్టర్ మరణవార్త అందర్నీ షాక్ కి గురి చేస్తుంది. కొన్ని రోజులు క్రిందట వరకు యూట్యూబ్ వీడియోస్ తో ప్రేక్షకులకు కనిపిస్తూ వచ్చిన ఆయన.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా రాకేష్ మాస్టర్ తన మరణం గురించి ముందే చెప్పారంటూ ఒక వీడియోని నెటిజెన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ.. “నా శరీరంలో మార్పులు వస్తున్నాయని నాకు తెలుసు. నేను అస్తమించే సూర్యుడిని” అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వైరల్ వీడియోని చూసిన కొందరు అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.
‘‘ఇల్లు, దుస్తులు, శరీరం ఏదీ శాశ్వతం కాదు. మట్టిలో కలిసిపోయేదే పర్మినెంట్’’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన రాకేశ్ మాస్టర్ తన అంతిమ యాత్ర ఎలా ఉంటుందో చూసుకోవాలనిపించి సంబంధిత వీడియో తీశామని తెలిపారు. ‘‘నా మామగారు (భార్య తండ్రి) సమాధి పక్కన వేప మొక్క నాటా. దాన్ని పెంచుతా. నేను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే నన్ను సమాధి చేయండని యూట్యూబ్ ఛానెల్స్‌కు విజ్ఞప్తి చేశా’’ అని ఓసారి వివరించారు.
ఇక రాకేష్ మాస్టర్ కెరీర్ విషయానికి వస్తే.. రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్ రామారావు. ఆట, ఢీ వంటి డ్యాన్స్ షోలతో కెరీర్ ని స్టార్ట్ చేశారు. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, చిరునవ్వుతో వంటి సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు.