Home > సినిమా > లియోలో అది మిస్ కావొద్దట

లియోలో అది మిస్ కావొద్దట

లియోలో అది మిస్ కావొద్దట
X

తమిళ్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా లియో. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చాలా కాలం తర్వాత విజయ్ కి జోడీగా నటించింది త్రిష. సంజయ్ దత్, అర్జున్ సర్జా విలన్స్. తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. విజయ్ - లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలు గ్యారెంటీ. ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ తెలుగులో యావరేజ్ అయినా తమిళ్ లో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇటు లోకేష్.. విక్రమ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కించిన సినిమా కాబట్టి తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. తెలుగులో ప్రమోషన్స్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు కానీ.. తమిళ్ లో మాత్రం వరుస ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ సందర్భంగా అతనో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు.

లియో చిత్రాన్ని మొదటి పదినిమిషాలు అస్సలు మిస్ కావొద్దన్నాడు. ఆ పదినిమిషాలు మిస్ అయితే సినిమా అంతా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుందట. చాలా సన్నివేశాలతో ఆ మొదటి పది నిమిషాలు ఇంటర్ లింక్ అయ్యి ఉంటాయని చెబుతున్నాడు. అంటే ఇది తన ఎల్.సి.యూ(లోకేష్ సినీ వర్స్) లో భాగంగా రూపొందిస్తోన్న సినిమానే అనుకోవచ్చు. లోకేష్ చెప్పలేదు కానీ.. ఆ పది నిమిషాల్లో విజయ్ మారు వేషంలో వెళ్లడానికి కారణమయ్యేలా విక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించే ఫహాద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉంటుందని టాక్. అంటే విక్రమ్ కు కొనసాగింపుగానో లేక దానికి ముందు కనిపించే కథగానో ఈ లియో ఉంటుంది. ఇక ఈ ఫస్ట్ టెన్ మినిట్స్ సీన్స్ కు సంబంధించిన క్లియర్ పిక్చర్ క్లైమాక్స్ లో ఉంటుందని.. అది మరో పార్ట్ కు లీడ్ గా ఉంటుందని టాక్. మొత్తంగా లియో పూర్తిగా అర్థం కావాలంటే మొదటి పదినిమిషాలు అస్సలు మిస్ కావొద్దని పదే పదే చెబుతున్నాడు దర్శకులు లోకేష్ కనకరాజ్.


Updated : 14 Oct 2023 7:10 PM IST
Tags:    
Next Story
Share it
Top