Home > సినిమా > బిగ్బాస్ హౌస్లో బిగ్ ట్విస్ట్.. కంటెస్టెంట్ల రీ ఎంట్రీ..

బిగ్బాస్ హౌస్లో బిగ్ ట్విస్ట్.. కంటెస్టెంట్ల రీ ఎంట్రీ..

బిగ్బాస్ హౌస్లో బిగ్ ట్విస్ట్.. కంటెస్టెంట్ల రీ ఎంట్రీ..
X

బిగ్బాస్ తెలుగు సీజన్ 7 ఊహించని మలుపులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఐదో వారం ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపిన బిగ్ బాస్ ఆరో వారం ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ వీకెండ్ లో ముగ్గురి రీఎంట్రీకి ప్లాన్ చేశాడు. అయితే ఆ ముగ్గురు హౌస్లో ఉంటారా లేక ఒకరిద్దరు మాత్రమే హౌస్ మేట్స్ అవుతారా అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.

సిక్త్స్ వీకెండ్లో రతిక, దామినీ, శుభ శ్రీ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మూడో వారం దామిని ఎలిమినేట్ కాగా.. ఆ తర్వాతి వారం రతిక రోజ్, ఐదో వారం శుభ శ్రీ రాయగురు హౌస్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ ముగ్గురిని మరోసారి హౌస్ లోకి పంపాలని బిగ్ బాస్ డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు హౌస్ లోకి ఎంటరైనట్లు ప్రోమోను చూస్తే అర్థమవుతుంది.

ఇదిలా ఉంటే ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో మొదలైన సీజన్ 7లో ఈ వారం ఏం జరగనుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ దామిని, రతిక, శుభ శ్రీలను మళ్లీ హౌస్ మేట్స్ గా మారుస్తారా లేక స్పెషల్ గెస్టులుగా ఇంట్లోకి పంపారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్గా మారింది. మరికొందరు మాత్రం ముగ్గురి రీ ఎంట్రీ ఉండకపోవచ్చని, ఒకరు లేదా ఇద్దరి రీఎంట్రీ ఉండొచ్చని అంటున్నారు. మొత్తమ్మీద ప్రతివారం వీకెండ్ షోకు సంబంధించి ఏదో ఒక లీక్ బయటకు వస్తుండగా.. ఈ వారం మాత్రం రీ ఎంట్రీల గురించి ఎలాంటి సమాచారం లీక్ కాకుండా చూసుకోవడంలో బిగ్ బాస్ నిర్వాహకులు సక్సెస్ అయ్యారు. దీన్ని బట్టి చూస్తే సీజన్ 7 ముందు ముందు ఇంకెన్ని ట్విస్ట్లు ఉంటాయన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.



Updated : 14 Oct 2023 7:55 PM IST
Tags:    
Next Story
Share it
Top