టిల్లు స్టోరీ మళ్లీ రిపీట్.. ఈసారైనా జోడీ దొరికిందా
X
గతేడాది చిన్న సినిమాగా రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న సినిమా డీజే టిల్లు. రోమాంటిక్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో సిద్ధు జొన్నల గడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘టిల్లు స్వ్కేర్’.. రామ్ మల్లిక్ డైరెక్షన్ లో రాబోతోంది. ఈ సినిమాలో సిద్దు సరసన అనుమప పరమేశ్వరన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. చాలాకాలంగా ఈ సినిమా రిలీజ్ పై వార్తలు వస్తూనే ఉన్నా.. మూవీ టీం మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
ఈ క్రమంలో సినిమాలోని పాటను ఇవాళ (జులై 26) విడుదల చేసింది. ఇటీవలే ఈపాట గ్లింప్స్ విడుదల చేయగా.. ఫ్యాన్స్ లో హైప్ పెంచింది. దాంతో పాటకోసం ఎదురుచూశారు అభిమానులు. టిల్లు స్వ్కేర్ నుంచి ‘టికెట్ కొనకుండా..’ అంటూ సాగే పాటను విడుదల చేసింది. ‘బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నా షూ నేను వేసుకుని పోతా.. లేడంటే.. నిన్నేసుకుని పోతా’ అంటూ మొదలైన పాటతో.. టిల్లు స్క్వేర్ లో మొదటి పార్ట్ ను మించి ఉంటుందని అర్థం అవుతుంది. కాగా, ఈ సినిమాకు సిద్దునే కథ అందించడం గమనార్హం.