Tiger 3 ON OTT : ఓటీటీలోకి టైగర్ 3.. ఎప్పుడు..? ఎక్కడ అంటే..?
X
సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘టైగర్ 3’. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మనీశ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 12న రిలీజ్ కాగా.. రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సల్మాన్ ఫైట్ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్ టవల్ ఫైట్ సీన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘టైగర్ 3’ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ ప్రైమ్ వీడియో గుడ్ న్యూస్ చెప్పింది.
టైగర్ 3 మూవీ జనవరి 7 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్‌కు రానుంది. టైగర్ 3 చిత్రాన్ని డిసెంబర్ 31న ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ బాలీవుడ్‌లో ఏ సినిమానైనా రిలీజైన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలనే నిబంధన ఉంది. దీంతో సినిమా ఓటీటీ విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం మూవీ రిలీజై 8 వారాలు పూర్తి కావడంతో అమెజాన్లో స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
విద్వేషపు ఆలోచనల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హష్మీ) పాకిస్థాన్ ప్రధాని నస్రీన్ ఇరానీ (సిమ్రాన్)ని హత్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ (సల్మాన్‌ఖాన్)పై వేయాలని ప్లాన్ చేస్తాడు. నస్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు నచ్చని అతీష్, పాకిస్థాన్ సైన్యాధికారుల్ని రెచ్చగొట్టేలా ఓ వ్యూహం రచిస్తాడు. టైగర్, అతని భార్య జోయా (కత్రినాకైఫ్) పర్సనల్ లైఫ్లోకి ఎంటరై వారి బిడ్డ జూనియర్‌ని అడ్డం పెట్టుకుని ఇస్తాంబుల్‌లో ఓ ఆపరేషన్‌కు ఇద్దరినీ వాడుకుంటాడు. ఆ ఆపరేషన్‌తోనే టైగర్‌నీ, జోయానీ ప్రపంచం ముందు దేశద్రోహులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి అతీష్ ప్లాన్ సక్సెస్ అయిందా? తనపై మచ్చ పడకుండా టైగర్ ఎలా తిప్పికొట్టాడన్నది మిగతా కథ.