టైగర్ నాగేశ్వరరావు మరీ అంతా
X
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా టైగర్ నాగేశ్వరరావు. వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 20న విడుదల కాబోతోంది. సినిమాపై భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా విడుదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏ సినిమాకైనా నిడివి చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నాగేశ్వరరావు చాలా ఎక్కువ నిడివితో వస్తున్నాడు.
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలను ఫాస్ట్ ఫార్వార్డ్ లో చూస్తున్నారు. ఎంత వేగంగా అయిపోతే అంత హ్యాపీగా ఫీలవుతున్నారు.అందుకే రెండు నుంచి రెండున్నర గంటల్లోనే సినిమా అయిపోవాలనుకుంటున్నారు. కొన్ని సినిమాలు మాత్రం మూడు గంటల పైగా నిడివి ఉంటున్నాయి. ఇలాంటి సినిమాలు కళ్లు తిప్పుకోనివ్వని స్క్రీన్ ప్లేతో ఉంటే వర్కవుట్ అవుతాయి. లేదంటే ఖచ్చితంగా ఆ నిడివి కారణంగానే ఆడియన్స్ నుంచి తిరస్కారానికి గురవుతాయి. సినిమా ఏ మాత్రం బోర్ కొట్టినా సాగదీత అనే మాట వస్తుంది. ఇవన్నీ టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ కు తెలియదు అని కాదు. అయినా వాళ్లు కూడా మూడు గంటల నిడివితో వస్తున్నారు.
తాజాగా ఈ మూవీ సెన్సార్ అయింది. సెన్సార్ నుంచి టైగర్ నాగేశ్వరరావుకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. పూర్తి నిడివి అంటే మూడు గంటల ఒక్క నిమిషం పాటు సినిమా ఉంటుందట. స్టూవర్ట్ పురం దొంగ కథే అయితే అంత లెంగ్త్ అవసరం లేదు. కానీ వీళ్లు సినిమాలో నాగేశ్వరరావు, టైగర్ నాగేశ్వరరావుగా మారిన వైనాన్ని చూపించబోతున్నారు. అంటే రెండు భిన్నమైన పాత్రలు లేదా కాలాల్లో రవితేజ కనిపిస్తాడు. అందుకోసం మూడు గంటల టైమ్ తీసుకున్నారేమో కానీ.. సినిమా ఎంగేజింగ్ గా లేకపోతే ఖచ్చితంగా ఈ నిడివే టైగర్ కు పెద్ద శాపం అవుతుందనడంలో డౌటే లేదు.