Ravi Teja : దూకుడు పెంచిన టైగర్
X
ఏ రంగంలో అయినా పోటీ ఉంటేనే తోపులు ఎవరో తెలుస్తుంది. మరి పోటీ ఉంటే ప్రమోషన్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉండాలి కదా.. ఈ విషయంలో దసరా మూవీస్ లో ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా హడావిడీ కనిపించడం లేదు. అయితే దసరా బరి నుంచి తప్పుకుంటాడు అనిపించిన రవితేజ సడెన్ గా దూకుడు పెంచాడు. రీసెంట్ గా ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు అక్కడ కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఇక ఇప్పుడు తెలుగులోనూ మొదలుపెట్టాడు.
స్పాట్ :
వాయిస్ :
టైగర్ నాగేశ్వరరావు.. వంశీ అనే కొత్త దర్శకుడు రూపొందించిన సినిమా. ఈ నెల 20న విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ నామా నిర్మించాడు. రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించగా కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్, జిషుసేన్ గుప్తా, మురళీ శర్మ, హరీష్ పేరడీ నటించారు. దసరా బరిలో విడుదల చేస్తాం అని ఎప్పుడో ప్రకటించిన ఈ మూవీ విషయంలో మధ్యలో కొన్ని రూమర్స్ వచ్చాయి. బట్ వాటిని కట్ చేస్తూ దసరాకే దిగుతున్నాం అని డిక్లేర్ చేయడమే కాదు.. దసరా మూవీస్ లో ముందుగా ట్రైలర్ విడుదల చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచాడు. ప్యాన్ ఇండియన్ రిలీజ్ గా రాబోతోన్న టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. భారతదేశపు అతిపెద్ద దొంగ అనే ట్యాగ్ తో ప్రమోట్ చేస్తోన్న ఈ మూవీ ష్యూర్ షాట్ అనేలా ఉందంటున్నారు.
స్పాట్ :
వాయిస్ :
దసరా బరిలో ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావుతో పాటు బాలకృష్ణ భగవంత్ కేసరి తెలుగు నుంచి ఉన్న సినిమా. మిగతా మూడూ డబ్బింగ్ సినిమాలు. వీటిలో తమిళ్ నుంచి రాబోతోన్న లియోపై భారీ అంచనాలున్నాయి. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా లోకేష్ పై ఉన్న నమ్మకంతో అంచనాలు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. దీంతో పాటు కన్నడ నుంచి శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్, హిందీ నుంచి టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ చిత్రాలు అక్టోబర్ 19న విడుదల కాబోతోన్నాయి. ఇదే రోజు భగవంత్ కేసరి కూడా వస్తోంటే.. ఆ నెక్ట్స్ డే టైగర్ నాగేశ్వరరావు ఉంది. అందుకే టైగర్ దూకుడు పెంచాడు. ట్రైలర్ తర్వాత వరుసగా ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ముందుగా టెక్నీషియన్స్ తో స్టార్ట్ చేశారు. సినిమా రిలీజ్ కు దగ్గరవుతున్నా కొద్దీ స్టార్ కాస్ట్ యాడ్ అవుతుంది. సో.. బాలయ్య ట్రైలర్ వస్తే అంచనాలు మారతాయని చెప్పొచ్చు. అయినా ఇప్పటి వరకైతే టైగర్ ఆడియన్స్ కు చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పాలి. ఇలాంటి వారికే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అఫ్ కోర్స్ బాలయ్య తర్వాతే అనుకోండి.