Home > సినిమా > ఫేస్బుక్ లైవ్లో విషం తాగిన కపిల్ శర్మ షో నటుడు..

ఫేస్బుక్ లైవ్లో విషం తాగిన కపిల్ శర్మ షో నటుడు..

ఫేస్బుక్ లైవ్లో విషం తాగిన కపిల్ శర్మ షో నటుడు..
X

బాలీవుడ్ నటుడు తీర్థానందరావు ఆత్మహత్యాయత్నం చేశాడు.తనతో సహజీవనం చేస్తున్న మహిళ మోసం చేసిందంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగాడు. ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన తీర్థానంద డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తోందని, తనపై కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. లైవ్లో మాట్లాడుతూనే ఒక్కసారిగా పురుగు మందు తాగాడు.

ఫేస్బుక్ లైవ్లో తీర్థానంద విషం తాగిన విషయం చూసిన స్నేహితులు వెంటనే ఇంటికెళ్లారు. అప్పటికే తీర్థానంద రావు అపస్మారక స్థితికి చేరుకోవడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని డాక్టర్లు చెప్పారు. తీర్థానంద రావు గతంలో కపిల్ శర్మతో కలిసి పనిచేశారు. గతంలోనూ ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్టు సమాచారం.

Updated : 14 Jun 2023 1:15 PM IST
Tags:    
Next Story
Share it
Top