Samantha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత
X
ప్రముఖ నటి సమంత నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. తీర్థప్రసాదాలను ఆలయ అధికారులు అందించారు. సమంత రాకతో ఆలయ పరిసరాల్లో కోలాహకం నెలకొంది. ఇవాళ సమంత తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని కూడా సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజాలు చేశారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలువుతున్నాయి. అమ్మవారి పుష్పాంజలి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అమ్మవారి దర్శనం అనంతరం సమంతకు పండితులు వేద ఆశీర్వాదం అందించారు.
ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.గత కొద్దిరోజులుగా సమంత తరుచూగా టూర్‌లకు వేళ్లుతుంది.తాజాగా వెకెషన్ నుండి అమ్ముడు తిరిగివచ్చింది. మల్లి విదేశాలకు వెళ్ళింది సమంత. అయితే… తాజాగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు సమంత. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా, సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా సినిమాను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఓ భారీ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.