Home > సినిమా > రేపు పంజాగుట్ట స్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

రేపు పంజాగుట్ట స్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు

రేపు పంజాగుట్ట స్మశానవాటికలో చంద్రమోహన్ అంత్యక్రియలు
X

తెలుగు చిత్రసీమలో గొప్ప నటుల్లో ఒకరిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యుల చెప్పారు. అమెరికాలో ఉంటున్న చంద్రమోహన్ పెద్ద కుమార్తె ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం ఉదయం చంద్రమోహన్ పార్థివదేహాన్ని ఇంటి దగ్గర నుంచి నేరుగా పంజాగుట్ట స్మశానవాటికకు తరలిస్తారని సమాచారం. అభిమానుల సందర్శనార్థం తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఆయన భౌతిక కాయాన్ని కొద్దిసేపు ఉంచుతారని వార్తలు వచ్చాయి. అయితే పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే చంద్రమోహన్ ఇంటికి వచ్చి నివాళులు అర్పించారని, ఆయన చనిపోయి రెండు రోజులు గడిచిపోయినందున తెలుగు ఫిలిం ఛాంబర్ కు తలరించకుండా నేరుగా పంజాగుట్ట స్మశానవాటికకు తరలించాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు సమాచారం. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ శనివారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.

Updated : 12 Nov 2023 8:16 PM IST
Tags:    
Next Story
Share it
Top