Chandramohan: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. నటుడు చంద్రమోహన్ కన్నుమూత
X
టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ (80) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద చాయలు నెలకొన్నాయి. చంద్రమోహన్ కు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం నాడు హైదరాబాద్ లో ఆయన అంత్యక్రియలు నిర్వహిచేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా పమిడిముక్కల గ్రామంలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్.. నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించారు. బాపట్ల వ్యవసాయ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. 1966లో రంగులరాట్నం సినిమాతో తెరంగేట్రం చేశారు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకుగానూ ఫిలింఫేర్, నంది అవార్డులు అందుకున్నారు. స్టార్ హీరోయిన్ శ్రీదేవి హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ‘పదహారేళ్ల వయసు’ సినిమాకు.. చంద్రమోహన్ ఆమెకు జోడీగా నటించారు. అమాయకపు పాత్రతో ఆయన ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత కూడా శ్రీదేవి కాంబినేషన్ లో ఆయన నటించారు. పదహారేళ్ల వయసు, సిరి సిరి మువ్వ సినిమాల్లో చంద్రమెహన్ నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. 1987లో వచ్చిన చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఆయని చివరి సినిమా ఆక్సిజన్ 2017లో విడుదల అయింది. ఆయన మొత్తం 932 సినిమాల్లో నటించారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.