నరేశ్‌కు ఐక్యరాజ్య సమితి ‘సర్’ అవార్డు.. నిజంగానే...
X
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్‌కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఉగ్రవాదం, అభివృద్ధి తదతర అంశాలపై ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రసంగాలకు గుర్తింపుగా ‘సర్’అవార్డు దక్కింది. ఐక్యరాజ్య సమితికి చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ప్లానింగ్ (ఎన్ఏఎస్డీపీ), ఇంటర్నేషనల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ హ్యూమన్ రైట్స్ (ఐఎస్ సీఏహెచ్ఆర్) సంస్థలు ఆయనకు ఈ బిరుదాన్ని ప్రదానం చేశాయి.
నరేశ్ విజయకృష్ణ అంతర్జాతీయ ఉగ్రవాదంపై చేసిన ప్రసంగాలు ఆలోచన రేకెత్తించేలా ఉంటాయని ఈ సంస్థలు కొనియాడాయి. ఫిలిప్పీన్స్‌లోని క్వెజాన్ సిటీలో జరిగిన ఈ సంస్థల 5వ ప్రపంచ సదస్సులో శుక్రవారం నరేశ్‌కు పురస్కారం అందజేశారు. భారత్ తరపున నరేశ్ తోపాటు పలువురు మేధావులు హాజరయ్యారు. నరేశ్‌కు మిలటరీ ఆర్ట్స్ అండ్ హ్యూమన్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ తోపాటు ఆర్బిట్రేషన్ అండ్ పీస్ మీడియేషన్ లో పీహెచ్డీని కూడా ప్రదానం చేశారు. ఈ పురస్కారంతో నరేశ్‌కు అంబాసిడర్ లెఫ్టినెంట్ కల్నల్ సర్ హోదా లభిస్తుంది. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నారని నరేష్ చెప్పారు.