Home > సినిమా > పవర్ స్టార్ హిట్ సినిమా టైటిల్‎తో నితిన్ కొత్త సినిమా

పవర్ స్టార్ హిట్ సినిమా టైటిల్‎తో నితిన్ కొత్త సినిమా

పవర్ స్టార్ హిట్ సినిమా టైటిల్‎తో నితిన్ కొత్త సినిమా
X

నితిన్ కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రారంభం అయ్యింది. . 'వకీల్ సాబ్' ఫేమ్​ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో ఈ చిత్రం చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు నిర్మించనున్న చిత్రమిది. ఆ సంస్థలో 56వ చిత్రమిది. దీనికి 'తమ్ముడు' టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ఈవెంట్​కు మూవీటీమ్​తో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సహా మరి కొందరు హాజరయ్యారు

కాగా ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్​​ సూపర్ హిట్​ మూవీ 'తమ్ముడు' టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. 'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ రాసుకొచ్చారు. కాగా, పవన్ కల్యాణ్​కు నితిన్​ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇప్పుడు పవన్ టైటిల్​ 'తమ్ముడు'తోనే వస్తుండడం వల్ల సినిమాపై అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే అన్నీ పూర్తి చేసుకుని రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం అందింది. త్వరలోనే సినిమాలో నటించే నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలను తెలియజేయనున్నారు.

'తమ్ముడు' టైటిల్ మాత్రమే కాదు, ఈ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానే. 'వకీల్ సాబ్' తర్వాత వేణు శ్రీరామ్ చేస్తున్న చిత్రమిది. ఇక పవన్ టైటిల్ తో సినిమా తీస్తుండటంతో నితిన్ ఫ్యాన్స్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.

Some titles come with a lot of responsibility attached.



Updated : 27 Aug 2023 11:59 AM IST
Tags:    
Next Story
Share it
Top