Home > సినిమా > హీరో శ్రీకాంత్ కుమారుడికి లక్కీ ఛాన్స్..పాన్ ఇండియన్ సినిమాలో ఆఫర్

హీరో శ్రీకాంత్ కుమారుడికి లక్కీ ఛాన్స్..పాన్ ఇండియన్ సినిమాలో ఆఫర్

హీరో శ్రీకాంత్ కుమారుడికి లక్కీ ఛాన్స్..పాన్ ఇండియన్ సినిమాలో ఆఫర్
X

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు సినిమా 'పెళ్ళిసందD'తో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ .

ఆ సినిమా తరువాత పెద్దగా ఏ సినిమాలో కనిపించలేదు రోషన్. కానీ కాస్త గ్యాప్ తీసుకుని పాన్ ఇండియన్ లెవెల్ లోనే తప పెర్ఫార్మెన్స్‎తో దాడి చేసేందుకు రెడీ అయ్యాడు రోషన్. స్టార్ హీరో మోహన్ లాల్‎తో కలిసి ఓ పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్‎కు కొడుకుగా నటించనున్నాడు.

ఈ మధ్యనే ఏక్తా కపూర్ , మోహన్ లాల్ కలిసి ఒక పాన్ ఇండియా మూవీ ని ప్రకటించారు. ఈ మూవీని నంద కిషోర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‎లో తాజాగా తెలుగు అప్‎కమింగ్ స్టార్ రోషన్ కూడా భాగం కాబోతున్నాడు. దీంతో రోషన్ కు ఇది పెద్ద ఆఫరే అంటూ సినీ వర్గాలు అంటున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి ఆఫర్ రావడంతో అందరూ రోషన్ మీదే అటెన్షన్ పెడుతున్నారు. ఈ చిత్రంలో రోషన్ మోహన్ లాల్ కు కొడుకుగా కనిపించనున్నాడని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా సినిమా కావడంతో దాదాపుగా అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు, మలయాళంలో ప్రధానంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. కానీ హిందీ, తమిళం, కన్నడ వంట పలు బాషల్లో దీనిని రిలీజ్ చేస్తారు. ఈ మూవీ ఫుల్ లెన్త్ యాక్షన్ సినిమా. ఇందులో గ్రాఫిక్స్ కీ రోల్ పోషించనున్నాయని మేకర్స్ చెబుతున్నారు. అందుకే ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థం అవుతోంది.


మలయాళంలో మోహన్ లాల్ చిత్రం ఏది విడుదలైనా సూపర్ డూపర్ హిట్ కావాల్సిందే. ఆయన నటించిన ప్రతి సినిమా వైవిధ్యంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా రోషన్ కెరీర్ కు బాగా ప్లస్ కానుంది. ఈ సినిమా కనుగ హిట్ సాధిస్తే రోషన్ ఎక్కడికో వెళ్లిపోతాడు. క్రేజీ ఆఫర్లు తలుపుతడతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రోషన్ ఈ చిత్రంతో పాటు మరో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు. వైజయంతీ మూవీస్‌–స్వప్నా సినిమా బ్యానర్లపై రూపొందనున్న సినిమాలో హీరోగా ఎంపికయ్యాడు. కొత్త దర్శకుడు ప్రదీప్‌ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.



Updated : 13 July 2023 9:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top