Home > సినిమా > ‘మెగా’ ఇంటి అమ్మాయితో పెళ్లి నిజమేనా? ఆ హీరో క్లారిటీ ఇదీ..

‘మెగా’ ఇంటి అమ్మాయితో పెళ్లి నిజమేనా? ఆ హీరో క్లారిటీ ఇదీ..

‘మెగా’ ఇంటి అమ్మాయితో పెళ్లి నిజమేనా? ఆ హీరో క్లారిటీ ఇదీ..
X

మెగస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని లవర్ బాయ్ తరుణ్ పెళ్లిచేసుకోనున్నట్లు పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. ‘మెగా అల్లుడు కాబోతున్న తరుణ్, ముహూర్తం ఫిక్స్.. ఎట్టకేలకు ఒకంటివాడవుతున్న తరుణ్’ అంటూ ఏవేవో రాస్తున్నారు. ఈ వార్తలపై చిరు కుటుంబం నుంచి ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. తన కొడుక్కి త్వరలోనే పెళ్లి చేస్తున్నానని, అమ్మాయిది ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబమని తరుణ్ తల్లి, నటి రోజా రమణి చెప్పడంతో ఊహాగానాలకు మరింత బలం వచ్చింది. తరుణ్‌కు నలభై ఏళ్లు దాటిపోవడంతో తర్వగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు మరింత మసాలా జత చేస్తున్నారు. అతడు కూడా ఈ వార్తలపై స్పందించకపోవడంతో నిజమేనేమో అనే పరిస్థితి నెలకొంది. ఎట్టకేలకు స్పందించక తప్పలేదు.

‘‘ఆ వార్తల్లో నిజం లేదు. అంత పెద్ద శుభవార్త ఉంటే నేనే సంతోషంగా చెబుతాను. నా పెళ్లి విషయంలో ఈ పుకార్లు ఎందుకు వస్తున్నాయో నాకు అస్సలు తెలియడం లేదు.. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో పెళ్లి వార్తలకు చెక్ పడింది. తల్లిదండ్రుల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని బాల్యంలోనే సినిమాల్లోకి వచ్చిన తరుణ్ `నువ్వే కావాలి` సినిమాతో హిట్ కొట్టాడు. ఎన్నో ప్రేమకథా చిత్రాల్లో నటించి మెప్పించాడు. తర్వాత సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, కొత్త తరం నటులు రావడంతో కెరీర్ దెబ్బతినింది. ఆర్తి ఆగర్వాల్‌తో ప్రేమాయణం పెళ్లిదాకా నడిపినట్టు టాక్. ఆమె ఆత్మహ్యత్యలో ఆ లవ్ స్టోరీ విషాదంగా ముగియడంతో అటు వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందిపడ్డాడు. ఆలస్యంగానైనా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు.


Updated : 2 Aug 2023 5:06 PM IST
Tags:    
Next Story
Share it
Top