నా పేరు పక్కన 'ది' అందుకే పెట్టుకున్న..రౌడీ బాయ్
X
విజయ్ దేవరకొండ ఈ పేరుకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. అమ్మాయిల కలల రాకుమారుడు ఈ రౌడీ బాయ్. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్‌తో మాత్రమే పైకి వచ్చిన యంగ్ హీరో విజయ్. లైగర్ మినహా దాదాపు విజయ్ నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన లైగర్ డిజాస్టర్ కావడంతో విజయ్ చాలా ఫీల్ అయ్యాడు. అందుకే రెట్టింపు ఎనర్జీతో ఖుషీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు రెడీ అవుతున్నాడు. లేటెస్టుగా విడుదలైన ట్రైలర్ అందరికీ బాగా కనెక్ట్ అవుతోంది. విజయ్ పెర్ఫార్మెన్స్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సోషల్ మీడియా వేదికగా తనకు , అనసూయకు మధ్య నడుస్తున్న వివాదంపై తనదైన స్టైల్లో క్లారిటీ ఇచ్చాడు రౌడీ.
చాలా కాలంగా హీరో విజయ్ దేవరకొండ, యాంకర్ అనసూయకు మధ్య వివాదం నడుస్తున్నట్లు నెట్టింట్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ నటించిన ‘లైగర్’ మూవీ ఫ్లాప్ కావడంతో .. అనసూయ తన ట్విటర్ అకౌంట్లో విజయ్‌ని ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్ పెట్టి రచ్చ రచ్చ చేసింది. తమ అభిమాన హీరోపై అనసూయ కామెంట్స్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అనసూయను నెట్టింట్లో ఫ్యాన్స్ తెగ ట్రోల్స్ చేశారు. అనసూయ Vs విజయ్ ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే అసలు వీరిద్దరికీ మధ్య ఉన్న గొడవేంటి? అనేదానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ రాలేదు. ఇక లేటెస్టుగా రౌడీ బాయ్ కూడా ఈ వివాదంపై తన స్పందించాడు. తన పేరు పక్కన పెట్టుకున్న 'ది' అనే అక్షరం గురించి క్లారిటీ ఇచ్చాడు.
‘ఖుషి’ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఓ విలేఖరి అనసూయతో వివాదం ఏంట? దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతారని ప్రశ్నించగా విజయ్ రిప్లై ఇస్తూ.." ఆ వివాదం ఏమిటో ఆ గొడవ పడే వారినే మీరు అడగాలి. నెట్టింట్లో అసలు ఏం జరుగుతోందో నాకు అస్సలు తెలియదు. చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు. అందుకే నా పేరు పక్కన 'ది' అని అక్షరం పెట్టుకున్నాను. నా పేరెంట్స్ నాకు పెట్టిన పేరు ఉండగా నాకు స్పెషల్‌గా ట్యాగులు అవసరం లేదు" అంటూ విజయ్ తాజాగా విమర్శలకు చెక్ పెట్టాడు.