విజయ్ దేవరకొండ వింత డ్రెస్..రేటు వింటే మైండ్ బ్లాక్
X
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఖుషీ సినిమాతో తెరమీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. లైగర్ ఫ్లాప్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఖుషీ హిట్ కావాలంటూ రౌడీ బాయ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సెప్టెంబర్ 1న సినిమా విడుదల కాబోతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ను వీర లెవెల్లో చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా నిర్వహించిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కన్సర్ట్‌లో విజయ్ , సామ్‌లు కలిసి స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ కన్సర్ట్ కోసం విజయ్ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్‌గా నిలుస్తుంటాడు విజయ్ దేవరకొండ. కావాలని చేస్తాడో లేదా అలా జరుగుతుందో తెలీదు కానీ మీమర్స్‌కి విజయ్ మంచి స్టఫ్‌గా మారుతుంటాడు. తాజాగా జరిగిన ఖుషీ మ్యూజిక్ కన్సర్ట్‌లో విజయ్ వైట్ అండ్ వైట్ లో మెరిసిపోయాడు. సామ్‌తో కలిసి స్టెప్పులేసి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. అయితే ఈ పెర్ఫార్మెన్స్ను పక్కనపెడితే..విజయ్ ధరించిన ఔట్‌ఫిట్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ ఫ్యాషన్స్‌ను ఫాలో అవుతూ స్టైలిష్ ఔట్‌ఫిట్స్ ధరిస్తూ ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేసే విజయ్ ఈ కన్సర్ట్ కోసం వైట్ కలర్ కోట్, పలోజా మోడల్ ప్యాంట్ వేసుకుని కాస్త డిఫరెంట్‌గా కనిపించాడు. దీంతో నెటిజన్స్ విజయ్‌ని ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ డిజైనర్ ఔట్‌ఫిట్ ధర వింటే మాత్రం అంతా అవాక్కవ్వాల్సిందే. దీని ధర ఏకంగా రూ.2 లక్షలు వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.