టైట్ ఫిట్ డ్రెస్‌లో అనన్య నాగళ్ల ట్రెండీ పోజులు..నెట్టింట్లో మంటలు
X
తెలంగాణ బ్యూటీ అనన్య నాగళ్ల తన అందాలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. లేటెస్టుగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో దిగిన కిర్రాక్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్ల హృదయాలను అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఈ మధ్య కాస్త స్లో అయ్యింది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ఎప్పుడూ సంప్రదాయ లుక్‌లో కనిపించే అనన్య తన ట్రెండ్‌ను మార్చి ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చి అదరగొడుతోంది.
అనన్య తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన ఈ పిక్స్ నెటజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నయి. ఈ యంగ్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందానికి మంత్రముగ్ధులు అవుతున్నారు. అందాలను పొగుడుతూ అనన్యను ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. అంతే కాదు ఫోటోలకు లైకులు, కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.
ఈ ఫోటో షూట్ కోసం అనన్య బ్లాక్ అవుట్ ఫిట్‌ను ఎంచుకుంది. స్లీవ్ లెస్ క్రాప్ టాప్, టైట్ లెగిన్ లాంటి ట్రౌజర్ వేసుకుని కెమెరాకు క్రేజీ పోజులు అందించింది. ఓ మెరుపు మెరిసింది. ఓవైపు మోడ్రన్ గా కనిపిస్తూనే.. మరోవైపు గ్లామర్ లుక్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అనన్య. ప్రస్తుతం అనన్య ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అనన్య. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో అనన్యకు గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ఏ అవకాశం వచ్చినా వదులుకోకుండా సినిమాలు చేస్తోంది అనన్య. వకీల్ సాబ్, శాకుంతలం, మళ్లీ పెళ్లి వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. లేటెస్టుగా బిగ్ బాస్ ఫేమ్ సోహెల్‌తో కలిసి బూట్ కట్ బాల్రజ్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది.