Home > సినిమా > అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తా..విడాకులపై స్వాతి క్లారిటీ

అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తా..విడాకులపై స్వాతి క్లారిటీ

అలాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తా..విడాకులపై స్వాతి క్లారిటీ
X

సోషల్ మీడియా స్టార్స్ పర్సనల్ లైఫ్‏ను ప్రొజెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు వారికి సంబంధించిన విషయాలను ఈ మీడియం ద్వారానే తెలుసుకుంటున్నారు. గతంలో హీరో హీరోయిన్ ఎవరైనా సరే విడాకులు తీసుకుంటే అంతా పూర్తైన తరువాత తెలిసేది. కానీ ఇప్పుడు అలా కాదు. ఇన్‎స్టాలో పిక్స్ డిలీట్ చేసినా , ట్విటర్‎లో అన్‎ఫాలో అయినా చాలు నెటిజన్స్ వారి డివోర్స్‎ను కన్ఫర్మ్ చేసేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నటి కలర్స్ స్వాతిని కూడా ఇలాంటి రూమరే వెంటాడుతోంది. ఆమె రీసెంట్‎గా తన ఇన్‎స్టాగ్రామ్‎లో ఫొటోలు తొలగించేసరికి ఆమె కూడా డివోర్స్‎కు రెడీ అయ్యిందనే న్యూస్ వైరల్ అవుతోంది. గత కొంత స్వాతి డివోర్స్ టాపిక్ నెట్టింట్లో హాట్ టాపిక్‎గా మారింది. ఈ అంశంపైన స్వాతి తాజాగా క్లారిటీ ఇచ్చింది.

తమిళ సినిమా సుబ్రహ్మణ్యపురం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది తెలుగమ్మాయి స్వాతి. ఆ తరువాత నానితో 'అష్టాచమ్మా' సినిమా చేసి తెలుగులోనూ హీరోయిన్‎గా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ..నిఖిల్ తో స్వాతి చేసిన 'స్వామిరారా', 'కార్తికేయ' సినిమాలు మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. స్వాతి హీరోయిన్‎గా ఫామ్‌లో ఉండగానే వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తరువాత సినిమాలకు బై బై చెప్పేసి విదేశాలకు వెళ్లిపోయింది.

పెళ్లి తరువాత స్వాతి గతేడాది 'పంచతంత్రం' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 'మంత్ ఆఫ్ మధు' మూవీతో పాటు 'సత్య' అనే షార్ట్ ఫిల్మ్ చేస్తోంది. ఈ విషయం పక్కనబెడితే విడాకుల రూమర్స్ నిజమేనా కాదా అని స్వాతిని అడగ్గా 'చెప్పడానికి ఏం లేదని చెప్పుకొచ్చిందట స్వాతి. ఇజానికి అలాంటిది ఏమైనా ఉంటే తానే చెప్తానని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. 2020లోనూ స్వాతి తన ఇన్‎స్టాలో పిక్స్‎ను డిలీట్ చేసినప్పుడు ఇలాంటి రూమర్సే వచ్చాయి. ఆ సమయంలో రియాక్ట్ అయిన స్వాతి ఆ ఫోటోలను తాను ఆర్కైవ్‌లో సేవ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.

Updated : 26 July 2023 9:33 AM IST
Tags:    
Next Story
Share it
Top