Home > సినిమా > తెలుగు హీరోయిన్లు పనికిరారా...?..టాలీవుడ్‎‏పై Manchu Lakshmi పంచులు

తెలుగు హీరోయిన్లు పనికిరారా...?..టాలీవుడ్‎‏పై Manchu Lakshmi పంచులు

తెలుగు హీరోయిన్లు పనికిరారా...?..టాలీవుడ్‎‏పై  Manchu Lakshmi పంచులు
X

మెహన్ బాబు కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయినా, తన టాలెంట్‎తో నటిగా, హోస్ట్‎గా మంచి గుర్తింపును అందుకుంది మంచు లక్ష్మి. తాను మాట్లాడే విధానంపై ఎవరెన్ని కామెంట్లు చేసినా, సెటైరిక్‎గా మాట్లాడినా అవేమీ పట్టించుకోకుండా చాలా స్పోర్టివ్‎గా తన పని తాను చేసుకుంటూ ఇండస్ట్రీలో వెరీ స్ట్రాంగ్ ఉమెన్‎గా ముందుకెళ్తోంది లక్ష్మి. మరి ఉన్నట్లుండి ఏమైందో ఏమో మంచు లక్ష్మి టాలీవుడ్ ఇండస్ట్రీపై పంచులు పేల్చింది. తెలుగు హీరోయిన్లు, ఫిల్మ్ మేకర్స్‎తో పాటు ప్రేక్షకులను ఉద్దేశించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

" తెలుగు ఇండస్ట్రీకి రాక ముందు హాలీవుడ్ సినిమాలకు పని చేశాను. అక్కడే ఉండుంటే ఈ 10 ఏళ్లలో నేను ఎక్కడో ఉండేదాన్ని. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది. ఆ దేవుడు దయ వల్ల మళ్లీ హాలీవుడ్‌కి వెళ్లే ఛాన్స్ వస్తే మాత్రం ఏమా మాత్రం మిస్ చేసుకోను. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లనే తెలుగు వారికన్నా ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకు తెలుగువారిని ఆదరించరు. ఇక్కడి హీరోయిన్లని ఒక్క శాతం ప్రేమించినా వారు ఎక్కడో ఉంటారు. తెలుగమ్మాయి నిహారిక ఎందుకు పెద్దగా సినిమాలు చేయడం లేదు? బిందు మాధవి, మధుశాలిని, శివాత్మిక, శివాని వీరంతా ఎందుకు నటించడం లేదు? వీరికి అందం లేదా? టాలెంట్ లేదా? అన్నీ ఉన్నా కూడా ప్రేక్షకులు ఆదరించడం లేదు. వీరే కాదు సినిమా మేకర్స్‌ కూడా ముంబయి, పంజాబ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక అమ్మాయిలే కావాలంటున్నారు. తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు" అని మంచు లక్ష్మి ఇండస్ట్రీ పెద్దలను విమర్శించింది

Updated : 6 July 2023 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top