Home > సినిమా > నేను సక్సెస్ కాకపోవడానికి కారణం వారే..పాయల్ రాజ్‎పుత్

నేను సక్సెస్ కాకపోవడానికి కారణం వారే..పాయల్ రాజ్‎పుత్

నేను సక్సెస్ కాకపోవడానికి కారణం వారే..పాయల్ రాజ్‎పుత్
X

'ఆర్ఎక్స్100' సినిమాతో నటిగా తన కెరీర్‎ను స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్‎పుత్. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ సాధించింది. దీంతో ఈ బ్యూటీ దశ తిరుగుతుందని అంతా భావించారు. కానీ కథలో ఎలాంటి మార్పు కనిపించలేదు. తెలుగులో ఇప్పటి వరకు పాయల్ చాలా సినిమాల్లో నటించినా అవేమీ అమ్మడికి బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలో తాజాగా చేసిన ఓ ఇంటర్వ్యూలో అందుకు కారణం ఏమిటో రివీల్ చేసింది పాయల్. తాను ఇండెస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ కాకపోవడానికి కారణం డైరెక్టర్లేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.దీంతో పాయల్ రాజ్‎పుత్ కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‎గా మారాయి.

"ఆర్ఎక్స్ 100 సక్సెస్ తరువాత నేను ఒక్కదాన్నే హైదరాబాద్‎లో ఉంటున్నాను. ఈ టైమ్‎లో కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుని నన్ను మిస్ గైడ్ చేశారు. కొంతమంది డైరెక్టర్లు నన్ను తప్పుదోవ పట్టించారు. నన్ను వాడుకున్నారు. అందుకే నేను ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఏ సినిమా చేసినా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. అందుకే ఎలాంటి సమస్యలు లేవు. నేను ఎలాంటి సినిమాలు చేయాలో నాకు ఓ ఐడియా ఉంది. అయితే సినీ ఇండస్ట్రీలో టాప్‎లోకి వెళతాం, అలాగే కిందకి పడిపోతాం, కానీ తట్టుకొని నిలబడితేనే విజయం. నెగటివిటీని వదిలేసి, పాజిటివ్‎గా ముందుకు వెళుతున్నా" అని సంచలన కామెంట్స్ చేసింది పాయల్.

Updated : 1 July 2023 2:59 PM IST
Tags:    
Next Story
Share it
Top