Home > సినిమా > ఒక్క షాప్ ఓపెన్ చేస్తే... నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

ఒక్క షాప్ ఓపెన్ చేస్తే... నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

ఒక్క షాప్ ఓపెన్ చేస్తే... నిమిషానికి శ్రీలీల రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?
X

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీగా ఉన్న హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే శ్రీలీల పేరు తెరమీదకు వస్తుంది. పెళ్లి సందడి సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను ఫాలో అవుతున్న శ్రీలీల ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలకు సైన్ చేసింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ నటుల సినిమాల్లోనూ కీ రోల్ పోషిస్తూ తన క్రేజ్‎ను రోజు రోజుకు పెంచుకుంటోంది. క్రేజ్‏తో పాటు శ్రీ లీల తన రెమ్యూనరేషన్‎ను కూడా పెంచేస్తోంది.

శ్రీలీన తన ఫస్ట్ మూవీ పెళ్లి సందడికి కేవలం రూ.5 లక్షలు మాత్రమే తీసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన రవితేజ మూవీ ధమాకాకు రూ.50 లక్షలు డిమాండ్ చేసిందట. ఇక రామ్‎తో నటించిన స్కంద మూవీకి రూ.కోటి వరకు రెమ్యునరేషన్‌గా ఈ భామ తీసుకుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీలీల నటిస్తున్న 6 సినిమాలకు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ఈ భామ సైన్ చేసే మూవీస్‎కు రూ. 8 కోట్లు వరకు రెమ్యునరేషన్ ఫిక్స్‌ చేసే అవకాశం ఉందని సమాచారం.

ఒక్క సినిమాలే కాదు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‎లోనూ శ్రీలీల సందడి చేస్తుంటుంది. ఒక్కో మాల్ ఓపెనింగ్‎కు ఏకంగా కోటి వరకు వసూలు చేస్తుందని టాక్. అయితే ఈ ఓపెనింగ్ ఈవెంట్‎లో శ్రీలీల ఉండేది కేవలం 10 నిమిషాలే అంటే 10 నిమిషాలకు కోటి రూపాయలంటే ఒక్కో నిమిషానికి ఎంతలేదన్నా రూ.10 లక్షల వరకు తీసుకుంటుందని తెలుస్తోంది. ఇది చాలదన్నట్లు ఆమె ఫ్లైట్ ఖర్చులు, హోటల్ రూమ్స్, ట్రాన్స్‎పోర్ట్ ఖర్చులు అన్నింటినీ మాల్‌ నిర్వాహుకులే భరిస్తారు. ఎందుకంటే అమ్మడి క్రేజ్ అలాంటిది మరి. అందుకే శ్రీలీల ఎంత డిమాండ్ చేసినా మాల్స్ నిర్వాహకులు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని టాక్‌ వినిపిస్తుంది.



Updated : 12 Sept 2023 11:44 AM IST
Tags:    
Next Story
Share it
Top