Home > సినిమా > సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిసిన టాలీవుడ్ పెద్దలు

సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిసిన టాలీవుడ్ పెద్దలు

సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిసిన టాలీవుడ్ పెద్దలు
X

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అయితే ఈ విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుంచి సరైన స్పందన రాలేదు అనే విమర్శలుచాలా వచ్చాయి. కొత్త ప్రభుత్వానికి కనీసం విషెస్ చెప్పడంలో కూడా టాలీవుడ్ ఇబ్బంది పడింది. ఒకరిద్దరు తప్ప ఓపెన్ గా ఎవరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగ్రాట్యులేషన్స్ చెప్పలేదు. దీంతో కాంగ్రెస్ గెలవడం టాలీవుడ్ కు ఇష్టం లేదు అన్నట్టుగా కొన్ని వార్తా కథనాలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల తర్వాత అల్లు అరవింద్ త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలుస్తాం అని చెప్పాడు.

ఇక రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పుడు కేవలం దిల్ రాజు మాత్రమే తనకు ఫోన్ చేశాడనీ.. ఇప్పటి వరకూ ఏ సినిమావాళ్లూ తనతో మాట్లాడలేదని ఒక సందర్భంలో చెప్పాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మరి ఏమనుకున్నారో కానీ ఫైనల్ గా టాలీవుడ్ పెద్దలు కొందరు మొదటిసారిగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిశారు. దిల్ రాజు నేతృత్వంలోనే జరిగిన ఈ భేటీలో ప్రొడ్యూసర్స్ సి కళ్యాణ్, దామోదర ప్రసాద్, సునిల్ నారంగ్, సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి(నితిన్ తండ్రి) తో పాటు కే రాఘవేంద్రరావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు కోమటిరెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి ఆయనతో సినిమా పరిశ్రమ గురించిన వివరాలను పంచుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వం నుంచి పరిశ్రమకు ఎలాంటి సహకారం కావాలో వివరించినట్టు సమాచారం. మొత్తంగా మరీ ఎక్కువ రోజులు నాన్చినా తమకే నష్టం అని పరిశ్రమ పెద్దలు కాస్త ఆలస్యంగా అయినా గుర్తించినట్టున్నారు. మరి పనిలో పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిస్తే ఓ పనైపోతుంది. భవిష్యత్ లో మళ్లీ ప్రభుత్వం, పరిశ్రమ మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా ఉంటుంది.

Updated : 19 Dec 2023 10:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top