Home > సినిమా > స్టార్ హీరోయిన్‎కే ఛాన్స్ ఇచ్చిన శ్రీలీల..అవునా..నిజమా?

స్టార్ హీరోయిన్‎కే ఛాన్స్ ఇచ్చిన శ్రీలీల..అవునా..నిజమా?

స్టార్ హీరోయిన్‎కే ఛాన్స్ ఇచ్చిన శ్రీలీల..అవునా..నిజమా?
X

గత ఏడాది విడుదలైన నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న నితిన్‎కు నిరాశే ఎదురైంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో నితిన్ వెంకీ కడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్‎కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుంది మేకర్స్ భావించారు. ఈ విషయమై శ్రీలీలను సంప్రదించగా ఆమె కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. శ్రీలీల నితిన్ సినిమా నుంచి బయటకు వచ్చేసినట్లు టాక్ బాగా వినిపిస్తోంది. నిజంగా శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చిందా అనే దానిపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఎక్కువ శాతం ఈ బ్యూటీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం నిజమే అని అంటున్నారు.

శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో రష్మిక మందన ఫుల్ హ్యాపీగా ఉందట. శ్రీలీల కంటే ముందే ఈ పాత్రలో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారని సమాచారం . అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ, రష్మికఈ పాత్ర నుంచి బయటకు వచ్చేసింది . దీంతో శ్రీలీలను మేకర్స్ సెలెక్ట్ చేశారు. నితిన్ - శ్రీలీల కాంబినేషన్ బాగుంటుందని, ఆ జంట సూపర్ హిట్ అవుతుందని ఫిల్మ్ మేకర్స్ చాలా ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటియికే నితిన్ , శ్రీలీల కలిసి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఈ కాంబో సెట్ చేస్తే బాగుంటుందని వెంకీ కుడుములు.. నితిన్ -శ్రీలీలలని హీరో హీరోయిన్లుగా ఎంపిక చేసుకున్నారు . అయితే తాజగా ఈ సినిమా నుంచి శ్రీలీల కూడా తప్పుకుది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మైత్రి మూవీ మేకర్స్ టీంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే చేతి నిండా బిజీ షెడ్యూల్ ఉండటంతో శ్రీ లీల ఇబ్బంది పడుతుందని.. అందుకే ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేస్తూ.. లాస్ట్ మూమెంట్‎లో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటుంది అంటున్నారు..మరి ఇది ఎంత వరకు నిజం అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు నితిన్ సరసన హీరోయిన్‎గా ఎవరు నటిస్తారు..రష్మికకే ఛాన్స్ దక్కుతుందా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.



Updated : 11 Sept 2023 2:49 PM IST
Tags:    
Next Story
Share it
Top