Home > సినిమా > అన్న రికార్డ్ బద్దలు కొట్టిన తమ్ముడు..దుమ్ముదులుపుతున్న బేబీ

అన్న రికార్డ్ బద్దలు కొట్టిన తమ్ముడు..దుమ్ముదులుపుతున్న బేబీ

అన్న రికార్డ్ బద్దలు కొట్టిన తమ్ముడు..దుమ్ముదులుపుతున్న బేబీ
X

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా ‘బేబీ’. ఈ మూవీ జూలై 14న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్స్‌లో రికార్డులు బద్దలు కొడుతుంది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్‌గా మారిపోయింది. ఇక ఎన్నాళ్ల నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆనంద్‎ కెరీర్‎లో బ్లాక్‎బస్టర్ వచ్చి చేరింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిపై ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఈ కాంటెంపరరీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. బాక్సాఫీస్‌ దగ్గర బ్లాక్‎బస్టర్ హిట్‎గా నిలిచిన బేబీ కలెక్షన్స్ విషయంలో రికార్డులను బద్దలు కొడుతోంది.రూ.50 కోట్ల వసూళ్లతో దూసుకెళుతోంది.

చిన్న సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించి ఆనంద్ లేటెస్టుగా అన్న రికార్డునే బద్దలు కొట్టాడు. అర్జున్ రెడ్డి సినిమా వసూళ్లను బీట్ చేసి హల్ చల్ చేస్తోంది బేబీ.

అవును నిజమే... సాయి రాజేష్‌ దర్శకత్వంలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ ముఖ్య పాత్రల్లో కనిపించిన ఈ బేబీ విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి రికార్డును బద్దలు కొట్టేసింది. బేబీ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లను చేసింది. త్వరలో 100 కోట్లకు చేరువవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.





Updated : 26 July 2023 12:46 PM IST
Tags:    
Next Story
Share it
Top