Home > సినిమా > కళ్యాణ్ రామ్ హీరోయిన్‎కు పండంటి మగ బిడ్డ..పోస్ట్ వైరల్

కళ్యాణ్ రామ్ హీరోయిన్‎కు పండంటి మగ బిడ్డ..పోస్ట్ వైరల్

కళ్యాణ్ రామ్ హీరోయిన్‎కు పండంటి మగ బిడ్డ..పోస్ట్ వైరల్
X

టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్‌ నటించిన కత్తి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నటి సనా ఖాన్. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న సనా సినిమాలకు బైబై చెప్పి ఫ్యామిలీ లైఫ్‎ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా సనా ఖాన్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో సనా ఖాన్ చాలా యాక్టివ్‎గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన సంగతులను ఇన్‎స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటుంది. సనాకు ఇన్‎స్టాలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తనకు బాబు పుట్టిన విషయాన్ని కూడా సనా ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్ట్ పెట్టింది. పోస్ట్‎తో పాటు ఓ నోట్ ను షేర్ చేసింది సనా.. " మీరు మాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ దీవెనలు మా బిడ్డకు కూడా కావాలి’’ అని ఆమె కోరింది. దీంతో నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్‎బాక్స్‎లో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

2005లో బాలీవుడులోకి సనా ఖాన్‌ నటిగా ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సౌత్ వైపు దృష్టి సారించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ హీరోయిన్‎గా నటించింది సనా ఖాన్. కల్యాణ్ రామ్‏తో కత్తి సినిమాలో నటించగా, మంచు మనోజ్‌‎తో ‘మిస్టర్‌ నూకయ్య’ చిత్రంలో కనిపించింది. నటిగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే సినిమాలకు గుడ్‌ బై చెప్పేసి 2020లో అనాస్‌ సయ్యద్‌ని పెళ్లి చేసుకుంది.





Updated : 6 July 2023 9:07 PM IST
Tags:    
Next Story
Share it
Top