Home > సినిమా > బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మంచు మనోజ్ భార్య

బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మంచు మనోజ్ భార్య

బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మంచు మనోజ్ భార్య
X

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తాను త్వరలో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన భార్య భూమా నాగ మౌనిక రెడ్డి గర్భవతి అని వెల్లడించారు. మంచు మనోజ్, భూమా మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో గత ఏడాది మార్చిలో వారి వివాహం వేడుకగా జరిగింది. తండ్రి కాబోతున్నట్లు మంచు మనోజ్ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

తాజాగా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పోస్ట్‌కు భర్త మనోజ్‌ను, తన మొదటి కొడుకు ధైరవ్‌ని ట్యాగ్ చేసింది. మౌనిక చేసిన పోస్ట్‌కు మంచు మనోజ్ సరదాగా కామెంట్ చేశాడు. పిల్లా..ఓ పిల్లా నువ్వంటే నాకు ప్రాణమే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం భూమా మౌనిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫోటోలు చూసిన మంచు మనోజ్ అభిమానులు ఆ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన 'వాట్ ది ఫిష్' అనే ప్రాజెక్ట్ చేస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంతో పాటుగా ఉస్తాద్ అనే సెలబ్రిటీ గేమ్ షోకు కూడా మంచు మనోజ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే మంచు మనోజ్ అన్న మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో భక్తకన్నప్ప చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కూడా గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Updated : 24 Feb 2024 10:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top