Nikhil Siddhartha : గుడ్‌న్యూస్ చెప్పిన హీరో నిఖిల్..పోస్ట్ వైరల్
X
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆయన తెలిపారు. 2020లో డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆమె సీమంతం ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ నోట్ రాసుకొచ్చారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఆ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అందరీ ఆశీస్సులు కావాలనీ కోరారు.
నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా చేసుకుంటూ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్నారు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ-2 సినిమా రికార్డులు బద్దలుకొట్టింది. ఆ మూవీ నిఖిల్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో స్వయంభూ అనే సినిమాలో నిఖిల్ నటిస్తున్నారు. నిఖిల్ కెరీర్‌లో ఇది భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది.