Home > సినిమా > Sandeep Kishan : కుమారి ఆంటీకి టాలీవుడ్ హీరో మద్దతు

Sandeep Kishan : కుమారి ఆంటీకి టాలీవుడ్ హీరో మద్దతు

Sandeep Kishan : కుమారి ఆంటీకి టాలీవుడ్ హీరో మద్దతు
X

కుమారి ఆంటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ వల్ల ఆమె పేరు నెట్టింట మారుమోగింది. మీది మొత్తం 1000 అయ్యింది. రెండు లివర్లు ఎక్స్‌ట్రా అంటూ ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు ఆమె వద్దకు చేరుకుంటున్నారు. అలాగే యూట్యూబర్స్ కూడా ఆమె ఫుడ్ సెంటర్‌కు చేరుకుని వీడియోలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వద్దకు వచ్చేవారి వల్ల అక్కడ విపరీతంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కుమారి ఆంటీకి షాక్ ఇచ్చారు. ఆమె ఫుడ్ కౌంటర్‌ను నిలిపివేయాలని తెలిపారు. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద కుమారి ఆంటీ ఫుడ్ సెంటర్ వల్ల ట్రాఫిక్ ఏర్పడుతోంది. దానివల్ల ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగుతోంది. అందుకే ఆమె ఫుడ్ సెంటర్‌ను వేరేచోటుకు మార్చుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ఈ తరుణంలో కుమారి ఆంటీ మీడియా ముందుకు వచ్చిన తన బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ఆంటీకి టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ మద్దతుగా నిలిచారు. ఎంతో మంది వ్యాపారం చేసే మహిళలకు ఆమె స్ఫూర్తి అని సందీప్ కిషన్ ట్వీట్ చేశారు. సాధ్యమైనంత వరకూ ఆమెకు సాయం చేస్తానన్నారు. దీంతో కుమారి ఆంటీ అభిమానులు సందీప్ కిషన్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.




Updated : 31 Jan 2024 7:37 AM IST
Tags:    
Next Story
Share it
Top