Home > సినిమా > టాలీవుడ్ యంగ్ హీరోకి గాయం.. వీడియో

టాలీవుడ్ యంగ్ హీరోకి గాయం.. వీడియో

టాలీవుడ్ యంగ్ హీరోకి గాయం.. వీడియో
X

టాలీవుడ్ కుర్ర హీరో విశ్వక్ సేన్ రియల్ హీరోలా ఓ వీరోచిత సాహసం చేయబోయి పట్టుతప్పి గాయపడ్డాడు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ షూటింగ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం లారీపై ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ‘మాస్ కా దాస్’ లారీపై నుంచి అమాంతంగా కిందికి దూకుతుండగా బస్తా తగిలి పట్టుతప్పి పడిపోయాడు. కాలికి గాయమైందని, ప్రస్తుతం కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటున్నాడని సన్నిహిత వర్గాలు చెప్పాయి.

ప్రమాదానికి సంబంధించి వీడియో వైరల్ అంది. విశ్వక్‌ పరిస్థతేంటని అభిమానులు ఆందోళనపడుతున్నారు. ఇలాంటి ప్రమాదకర సన్నివేశాల్లో నటించకూడదని, డూప్ నటుణ్ని పెట్టుకోవాలని కోరుతున్నారు. రీల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరని, ప్రాణాలు పోయే పరిస్థితి తెచ్చుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో విశ్వక్ సరసన అంజలి, నేహశెట్టి హీరోయినట్లుగా నటిస్తున్నారు. విశ్వక్ పక్కా మాస్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయడానికి టీమ్ ప్రయత్నిస్తోంది


Updated : 15 Nov 2023 6:26 PM IST
Tags:    
Next Story
Share it
Top