Home > సినిమా > Salaar MOVIE : Part 1 : సలార్ మూవీకి రివ్యూ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోలు

Salaar MOVIE : Part 1 : సలార్ మూవీకి రివ్యూ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోలు

Salaar MOVIE : Part 1 : సలార్ మూవీకి రివ్యూ ఇచ్చేసిన టాలీవుడ్ హీరోలు
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ హంగామా మొదలైపోయింది. వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ ప్రీమియర్ షోలు ప్రారంభం కావడంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రివ్యూలు, పోస్టులు పెట్టేస్తున్నారు. సినిమాలో ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయంటున్నారు. యాక్షన్ బ్లాక్స్ ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎపిక్ అనిపించేలా తీశాడని, యాక్షన్ ఎపిసోడ్ లో ప్రభాస్ కటౌట్ చూస్తుంటే సీట్లల్లో కూర్చోవడం కష్టం అంటున్నారు. మోస్ట్ వయలెంట్ మ్యాన్ గా ప్రభాస్ బీభత్సం సృష్టించాడంటున్నారు. బాహుబలి తర్వాత ఫ్యాన్స్... ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అదేవిధంగా ప్రశాంత్ నీల్ చూపించాడని చెబుతున్నారు. ఇక ట్రేడ్ వర్గాలు అయితే... స‌లార్ తొలిరోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 170 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 70 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకోనున్న‌ట్లు చెబుతోన్నారు. సలార్ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ తో సెలెబ్రిటీలు కూడా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.

తాజాగా హీరో నిఖిల్ సిద్ధార్థ్ సలార్ మూవీని చూసి, సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చేశాడు. నిఖిల్ పోస్ట్ చేసిన ఆ రివ్యూ... ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. "ఇప్పుడే సలార్ మూవీ చూశా. ఇది మామూలు విజయం కాదు మాన్‌స్టర్ బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్నని ఎప్పుడు స్క్రీన్‌పై చూసినా గూస్ బంప్స్ వస్తాయి. హోంబాలే సంస్థకు కంగ్రాట్స్. ప్రశాంత్ నీల్ మనకి విజువల్ వండర్ ని ఇచ్చారు. తప్పకుండా చూడండి" అని నిఖిల్ ట్వీట్ చేశారు.

మరో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సలార్ మూవీపై తన స్పందన తెలిపాడు. సలార్ చిత్రం థియేటర్స్‌లో ఎంతో జోష్ నింపుతోంది. సెలెబ్రేషన్స్ మామూలుగా లేవు. చాలా రోజుల నుంచి ప్రభాస్ అన్నని ఇలా చూడాలని అంతా వెయిట్ చేస్తున్నారు. చెప్పాను కదా బాక్సాఫీస్ బద్దలైపోద్ది అని. సలార్ టీం కి కంగ్రాట్స్" అని నవీన్ పోలిశెట్టి ట్వీట్ చేశారు. మొత్తానికి ఓపెనింగ్స్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉండబోతున్నాయి. అయితే ఎలాంటి రికార్డులు సృష్టిస్తుంది అనేది రానున్న రోజుల్లో చూడాలి.






Updated : 22 Dec 2023 11:46 AM IST
Tags:    
Next Story
Share it
Top