సమంత, నిహారిక దారిలో మరో టాలీవుడ్ హీరోయిన్
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జంటల పెళ్లిళ్లు పెటాకులు అవుతున్న సంఘటనలు ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ రోల్ చేసే నటులంతా తమ వైవాహిక బంధానికి స్వస్తి చెబుతున్నారు. పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్, నాగ చైతన్య- సమంత, నోయిల్-ఎస్తర్, నిహారిక- చైతన్య వంటి జంటలు విడిపోతున్నామనే వార్త.. ఎన్నో రోజులుగా మీడియాలో నాన్చుతూ చివరకి కన్ఫామ్ చేస్తున్నారు. మీడియాకు లీకులు ఇస్తున్నట్లుగా ముందే సోషల్ మీడియాలో.. తమ తమ పార్టనర్స్ ఫోటోలను డిలీట్ చేయడం, లేదంటే బ్లాక్ చేయడం వంటివి చేస్తూ హింట్ ఇస్తున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతోంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. గతంలో సమంత, నాగచైతన్యతో విడిపోయేటప్పుడు ఇలాంటి పనే చేసింది. రీసెంట్గా మెగా డాటర్ నిహారిక కూడా ఇలాగే చేసింది. ఇక ఇప్పుడు వీళ్ల దారిలోనే స్వాతి కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. అందుకే స్వాతి విడాకుల బాటలో వెళ్తుందనే టాక్ ఊపందుకుంది. దీంతో మళ్లీ స్వాతి దీని పై క్లారిటీ ఇస్తుందా? లేదంటే.. విడాకులు ప్రకటించి షాక్ ఇస్తుందా? అనేది టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కలర్స్ స్వాతిగా చాలా పాపులర్ అయింది స్వాతి. బుల్లితెరపై పలు ప్రోగ్రామ్స్ చేసిన స్వాతి.. ఆ తర్వాత హీరోయిన్గా కూడా అలరించింది. అష్టచమ్మా, స్వామిరారా, కార్తికేయ, త్రిపుర వంటి సినిమాలతో హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకుంది. అయితే 2018 సంవత్సరంలో పైలట్ వికాస్‌ని ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది స్వాతి. వివాహం అనంతరం ఈ జంట విదేశాల్లో సెటిల్ అయ్యారు. అప్పటి నుంచి సినిమాలకు దూరమైన స్వాతి.. వైవాహిక జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కానీ గత కొంతకాలంగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. దానికి మరింత బలమిస్తు.. తాజాగా ఇన్స్టాగ్రామ్ నుండి భర్త ఫోటోలు డిలీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై కలర్స్ స్వాతి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.