Home > సినిమా > Kushita Kallapu : పెద్ద బిల్డప్ బాబాయ్‌లా ఉన్నావే.. వేణుస్వామిపై ఫైర్ అయిన హీరోయిన్ కుషిత!

Kushita Kallapu : పెద్ద బిల్డప్ బాబాయ్‌లా ఉన్నావే.. వేణుస్వామిపై ఫైర్ అయిన హీరోయిన్ కుషిత!

Kushita Kallapu : పెద్ద బిల్డప్ బాబాయ్‌లా ఉన్నావే.. వేణుస్వామిపై ఫైర్ అయిన హీరోయిన్ కుషిత!
X

ఈమధ్య తెలుగు అమ్మాయి కుషిత కల్లపు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని కొన్ని సినిమాల్లో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. కానీ అంతగా ఫేమ్ రాలేదు. అయితే డ్రగ్స్ కేసు తర్వాత కుషితకు ఎప్పుడూ లేనంత పాపులారిటీ వచ్చింది. తాము పబ్‌కి వెళ్లింది డ్రగ్స్ తీసుకోవడానికి కాదని, చీజ్ బజ్జీలు తినడానికని ఆమె చెప్పడంతో బజ్జీలు పాపగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకుంది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఆమె పేరు ఓ మోతమోగిందని చెప్పాలి.

కుషిత ఫేమస్ అవ్వడంతో ఆ ఫేమ్‌ను వేణుస్వామి లాంటి వారు తమకు అనుకూలంగా మార్చుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణుస్వామి బాగా ఫేమస్ అయ్యారు. సమంత దయ వల్ల ఆయన నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అప్పట్లో నాగచైతన్య, సమంత విడిపోతారని చెప్పడంతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఇక అప్పటి నుంచి సెలబ్రిటీస్ జీవితాల్లో జరిగే విషయాలను చెబుతూ ఆయన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

కుషిత డ్రగ్స్ కేసు విషయంపై కూడా వేణుస్వామి మాట్లాడారు. కొన్ని నెలల్లో కుషిత ఫేమస్ అవుతుందని చెప్పానని, చెప్పినట్లుగానే ఆమె డ్రగ్స్ కేసుతో ఫేమస్ అయ్యిందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్‌పై కుషిత స్పందించింది. కుషిత మాట్లాడుతూ..వేణు స్వామిని తాను డ్రగ్స్ ఇష్యూ తర్వాతే కలిశానని, దానిని తనకు అనుగుణంగా ఆయన ఎలా మార్చకుని చెబుతాడని కౌంటర్ ఇచ్చింది.

చూస్తుంటే వేణుస్వామి పెద్ద బిల్డప్ బాబాయ్‌లా ఉన్నాడని కుషిత చెప్పకనే చెప్పింది. ఇకపోతే 'బాబు నెం.1 బుల్ షిట్ గయ్' అనే మూవీతో కుషిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ థియేటర్లలో విడుదల కాగా ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ ఈ మూవీలో హీరోగా చేశారు. లక్ష్మణ వర్మ దర్శకత్వం వహించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఆ మూవీ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.


Updated : 10 March 2024 11:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top