వాన ముసురులో 'బేబీ' జోరు.. కలెక్షన్ల సునామీ
X
'మొదటి ప్రేమకు మరణం లేదు.. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది' అంటూ యూత్ గుండెల్ని టచ్ చేసిన 'బేబీ'(మూవీ) రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. వాన ముసురులో సైతం ఆగని జోరుతో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. ఫలితంగా లాభాల పంట పడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్‌లుగా.. విరాజ్ అశ్విన్, నాగబాబు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను కలర్ ఫోటో సినిమాతో జాతీయ పురస్కారం అందుకున్న రచయిత సాయి రాజేష్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ నిర్మించగా.. విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని ఇచ్చాడు.
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'బేబి' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా హక్కులకు పోటీ ఏర్పడింది. ఫలితంగా నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ జరుపుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బేబీ మూవీ కలెక్షన్స్ వావ్ అనేలా వసూళ్లు సాధిస్తోంది. కేవలం 6 రోజుల్లో రూ.43.8 కోట్లు సాధించిన ఈ మూవీ ఏడో రోజు కూడా మంచి స్పందన వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60 - 1.80 కోట్లు వరకూ షేర్‌ను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ. 1.90 - 2.00 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక, 8 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటికే మూడు రెట్లు వసూళ్లను రాబట్టి భారీ లాభాలను సొంతం చేసుకుంది.-
బేబీ సినిమాకు అదృష్టం అన్నట్లుగా ఈ వారం పెద్ద సినిమాలు ఏమీ లేవు. చిన్న సినిమాలు విడుదలైనా.. కాస్త ఓకే అన్నట్లుగా ఉన్నాయిని టాక్. అందుకే బేబీ సినిమా భారీ వసూళ్లు సాధించడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అందమైన సన్నివేశాలు, అద్భుతమైన నటన, హృదయాన్ని హాత్తుకునే బలమైన సంభాషణలు, ఎమోషనల్ మ్యూజిక్.. కలిపి బేబీ సినిమాను అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిపాయి. ఇక బేబీ పాత్రలో నటించిన వైష్ణవి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీకు యూత్ ఫిదా అవుతోన్నారు. ఇప్పటికీ కొన్ని థియేటర్ లలో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బేబీ మూవీ రూ.50 కోట్ల క్లబ్ లో చేరటం ఖాయం అంటున్నారు సినీ క్రిటిక్స్.