ఈ దీపావళి డబ్బింగ్ సినిమాలదేనా..
X
ఒక మంచి ఫెస్టివల్ సీజన్ అంటే సినిమా వారికి పండగ జోష్ డబుల్ అవుతుంది. ఆ టైమ్ లో విడుదలయ్యే సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ ఉంటుంది. రిజల్ట్ తో పనిలేకుండా సినిమాతో కలిపి పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ కొన్నాళ్లుగా కొన్ని సినిమాలకు సీజన్స్ తో పనిలేకుండా వాళ్లు వచ్చిందే సీజన్ లా మారుతోంది. అయినా ఎందుకో టాలీవుడ్ ముందు నుంచీ దీపావళి అంటే పెద్దగా పట్టించుకోదు. మధ్యలో కాస్త మారినా.. ఈ యేడాది మరోసారి పూర్తిగా దీవాళికి తెలుగు మూవీ పటాస్ లేం లేవు. కాకపోతే మూడు డబ్బింగ్ సినిమాలు మాత్రం వస్తున్నాయి.
దీపావళి అంటే టాలీవుడ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించదు. ఈ టైమ్ కు పెద్ద సినిమాలేవీ విడుదల కావు. వచ్చేవన్నీ దాదాపు మీడియం రేంజ్ మూవీస్ మాత్రమే. అయితే ఈ సారి మీడియం కాదు.. చిన్న సినిమాలు కూడా ఇప్పటి వరకూ డేట్స్ అనౌన్స్ చేయలేదు. కాకపోతే ఆ టైమ్ కు మూడు డబ్బింగ్ సినిమాలు రాబోతున్నాయి. రెండు తమిళ్ నుంచి ఒకటి హిందీ నుంచి. ఈ మూడూ భిన్నమైన కథలు. జగర్తాండ అంటూ కొన్నాళ్ల క్రితం తమిళ్ లో కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీని తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేసి ఇక్కడా విజయం అందుకున్నారు హరీష్ శంకర్ - వరుణ్ తేజ్. ఈ జిగర్తాండకు ప్రీక్వెల్ గా జిగర్తాండ2 వస్తోంది. లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని కూడా కార్తీక్ సుబ్బరాజే డైరెక్ట్ చేశాడు. ఇది 1970ల కాలంలో సాగే కథ అని రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ చూస్తే అర్థం అవుతుంది. కంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. కానీ మేకింగ్ పరంగా కాస్త తేడా కనిపిస్తోందనే టాక్ తెచ్చుకుంది. బట్ కార్తీక్ మంచి దర్శకుడు కాబట్టి అంచనాలున్నాయి. దీపావళి విడుదల అన్నారు కానీ ఖచ్చితమైన డేట్ చెప్పలేదు వీళ్లు.
ఇక తెలుగులో తిరుగులేని క్రేజ్, మార్కెట్ ఉన్న హీరో కార్తీ. అతను వైవిధ్యమైన కథలు ఎంచుకున్న ప్రతిసారీ మనవాళ్లూ విజయం కట్టబెట్టారు. అందుకే తన ప్రతి సినిమానూ ఇక్కడా విడుదల చేస్తుంటాడు. అలా ఇప్పుడు జపాన్ అనే వెరైటీ టైటిల్ ఉన్న సినిమాతో రాబోతున్నాడు. రాజు మురుగన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ మూవీ టైటిలే కాదు.. కంటెంట్ కూడా కొత్తగా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమైంది. ఈ మూవీని నవంబర్ 10న విడుదల చేయబోతున్నారు.
ఇక ఈ రెండిటికీ మించి వస్తోన్న సినిమా టైగర్ 3. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై తర్వాత సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నటించిన ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రాబతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఈ తరహా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దీనికి కాస్త మంచి కంటెంట్ కూడా యాడ్ అయితే టైగర్ బాక్సాఫీస్ వద్ద గర్జించడం ఖాయం. ఈ టైగర్3ని నవంబర్ 12న విడుదల చేయబోతున్నారు మేకర్స్. మొత్తంగా ఈ మూడు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగువాళ్లు దీపావళిని సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి వీరిలో సాలిడ్ విన్నర్ ఎవరో గెస్ చేసి కమెంట్ చేయండి.