ఆ కేరళ కుట్టి కోసం క్యూ కడుతున్న టాలీవుడ్ నిర్మాతలు
X
కేరళ ఇండస్ట్రీ నుంచి ఈ మధ్యనే 'ప్రేమలు' అనే మూవీ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చ. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది. చిన్న చిత్రమే అయినా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుందని చెప్పాలి. రొమాంటిక్ కామెడీ చిత్రానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ హీరోయిన్ మమిత బైజు పైనే ఉంది. ఓవర్ నైట్‌లోనే ఈ కేరళ కుట్టి స్టార్ అయిపోయింది.
మమిత బైజు క్యూట్‌నెస్‌కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. దీంతో మమితకు మలయాళంతో పాటు తెలుగులోనూ భారీగా ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ బడా నిర్మాతలు మమిత కోసం క్యూకడుతున్నట్లు ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ బ్యూటీ టాలీవుడ్‌ను ఏలేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ప్రేమలు మూవీని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసేందుకు చూస్తున్నారు.
ఇకపోతే మమితకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమట. సాధారణంగా కేరళ ఇండస్ట్రీలో బన్నీకి సూపర్ క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. పుష్ప మూవీ తర్వాత అది మరికాస్త పెరిగింది. మమిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను అల్లు అర్జున్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్‌లో షూటింగ్ జరిగే సమయంలో చాలా సార్లు బన్నీ ఇంటి నుంచే ట్రావెల్ చేసినట్లు తెలిపింది. ఒక్కసారైనా బన్నీని కలవాలని ఉందంటూ మమిత తన మనసులోని మాట చెప్పేసింది. రాబోయే రోజుల్లో ఈ అమ్మడు బన్నీ సరసన నటించినా ఆశ్చర్యపోనవసరం లేదు.