ఆమె కోసం వారు మా ఇంటికి వస్తున్నారు..హీరో నరేష్
X
'మళ్లీ పెళ్లి' సినిమాపై అభ్యంతరాలు తెలుపుతూ కోర్టు మెట్లు ఎక్కిన టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను బెంగళూరు కోర్టు కొట్టేసింది. మళ్లీ పెళ్లి సినిమాను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా టెలికాస్ట్ చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు నరేష్ ఇంటికి రమ్య రఘుపతికి వెళ్లే అనుమతి లేదందటూ కోర్టు తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపైన నరేష్ మాట్లాడారు. రమ్య గురించి పలు విషయాలు తెలిపారు.
"రమ్య రఘుపతికి చాలా అప్పులు ఉన్నాయి. అప్పుల వారు ఆమె కోసం తరచుగా ఇంటికి వస్తున్నారు. ఇలా వేరే వారు అప్పుల వసూలు కోసం ఇంటికి రావడం మా కుటుంబ సభ్యులకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకే మేము మా సేఫ్టీ కోసం కోర్టును ఆశ్రయించాను. కోర్టు కూడా మాకు సానుకూలంగా స్పందించింది. ఆమె ఇంట్లోకి రాకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రమ్య నేను ఇద్దరం విడివిడిగా ఉంటున్నామన్న విషయాన్ని కోర్టు కూడా ఆర్డర్ కాపీలో తెలిపింది. గత 6 ఏళ్లుగా మేమిద్దరం వేరువేరుగా ఉంటున్నాము. కోర్టు కూడా దీనిని నిర్థారించింది. కోర్టు తీర్పు మా డివోర్స్కు లైన్ క్లియర్ చేసినట్లైంది. ఈ తీర్పు నాకు విడాకుల విషయంలో సహాయపడుతుందన భావిస్తున్నాను" అని నరేష్ తెలిపారు.