గూఫీ డ్యాన్స్ ఇరగదీసిన సమంత..వీడియో వైరల్
X
ఫారెన్ వెకేషన్‌ను ఫుల్లెన్త్గా ఎంజాయ్ చేస్తోంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. తన స్నేహితురాలితో కలిసి ఇండోనేషియాలోని బాలీ టూర్‌కు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడి అందమైన లొకేషన్స్‌లో హాయిగా సేదదీరుతోంది . బాలీకి వెళ్లినప్పటి నుంచి సమంత తరచుగా బ్యూటిఫుల్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది . తాజాగా గూఫీ డ్యాన్స్‌తో మరోసారి అందిరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సమంత అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఏడాది పాటు సినిమాలకు సెలవు ప్రకటించి, తన హాలిడే వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తుంది సమంత. ఓ వైపు మయోసైటిస్కు ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. రీసెంట్గా సామ్ 4డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్ బాత్ చేసిన వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసి అందరిని షాక్‌కు గురిచేసింది. ఇప్పుడేమో తన ఫ్రెండ్‌తో కలిసి గూఫీ డ్యాన్స్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. అందరిని ఆకట్టుకుంది. గ్రుపో రఫగా బ్యాండ్ స్వర పరిచిన మెంటిరోసా మ్యూజిక్‌కు తన స్నేహితురాలితో కలిసి లయబద్దంగా డ్యాన్స్ చేసి మెస్మరైజ్ చేసింది సామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
సమంత తన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులను పూర్తి చేసింది. ప్రస్తుతం సామ్ ఖుషీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోంది. విజయ్ దేవరకొంగ హీరోగా నటించిన ఈ మూవీని శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ ఓ రేంజ్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఇక టీజర్‌ను వచ్చే వారం రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.