Home > సినిమా > పెళ్లిపై స్పందించిన అనుష్క శెట్టి

పెళ్లిపై స్పందించిన అనుష్క శెట్టి

పెళ్లిపై స్పందించిన అనుష్క శెట్టి
X

చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యింది . పి.మహేష్‌బాబు డైరెక్షన్‎లో వస్తున్న ఈ మూవీ సెప్టెంబర్‌ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‎కు రెండు రోజులే సమయం ఉండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‎ను జోరుగా చేస్తోంది. సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది. గత కొన్ని రోజులుగా మూవీ హీరో నవీన్ పొలిశెట్టి ఈ పనిలోనే మునిగిపోయాడు. ఇప్పుడు అనుష్క కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఓ ఇంగ్లీష్ మీడియతో మాట్లాడిన అనుష్క తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

‘‘ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు అన్విత. ఎంతో సానుభూతిపరురాలు. తన వర్క్ కంప్లీట్ చేసేందుకు దేనికైనా సిద్ధపడుతుంది. మిగతా అమ్మాయిల్లా కాదు. వెరీ స్పెషల్ అమ్మాయి. ఇంతటి మంచి కథ ఉన్న సినిమాలో నటించడం ఛాలెంజింగ్‎గా అనిపించింది. నా సినీ కెరీర్‌లో బాహుబలి, అరుంధతి, భాగమతి లాంటి సినిమాల్లో ఎన్నో స్పెషల్ క్యారెక్టర్లను పోషించాను. ఇప్పుడు ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ సినిమాలోనూ అన్విత క్యారెక్టర్ చాలా యూనిక్‎గా ఉంటుంది. ఇలాంటి పాత్రలు రావాలంటే లక్ ఉండాలి. నేను మూవీ ఫీల్డ్‎కు వచ్చిన ప్రారంభంలో నటనపై నాకు ఎలాంటి ఐడియా లేదు. అలాంటిది నేను ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యానంటే దీని వెనుక ఎంతో మంది సపోర్ట్ ఉంది. ఎన్ని సినిమాల్లో నటించినా, ఇప్పటికీ మొదటిసారి సెట్‌కు ఎలా వెళ్లానో అలానే వెళ్తాను. నాకు ఇచ్చిన పాత్రకు నూరు శాతం న్యాయం చేసేందుకు కృషి చేస్తాను. నా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నాను. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలనేది కోరిక. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. పెళ్లికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. టైం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను" అని అనుష్క తెలిపింది.



Updated : 5 Sept 2023 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top