Home > సినిమా > తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌..ఫొటో వైరల్‌

తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌..ఫొటో వైరల్‌

తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌..ఫొటో వైరల్‌
X

తాను తండ్రైన విషయాన్ని టాలీవుడ్ హీరో శర్వానంద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తన 40వ పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పేరు లీలా దేవి మైనేవి అని ప్రకటించారు. శర్వానంద్ గతేడాది జూన్‌లో హైకోర్టు న్యాయవాది కుతురు అయిన రక్షితారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇక శ‌ర్వానంద్ ఇవాళ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా తాను న‌టిస్తున్న‌ మూడు కొత్త‌ సినిమాల అప్‌డేట్స్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. వాటిలో ఒకటి చివ‌రి షెడ్యూల్‌లో ఉండగా.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి.

ఇక ఈ మూడు సినిమాల్లో కూడా శర్వానంద్ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించనున్నారు. శర్వా తన 35వ సినిమాని టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ ఆదిత్యతో చేస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్‌ కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకి ‘మనమే’ అనే క్లాసీ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇక అతని 36వ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్క‌నుంది. ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర ద‌ర్శ‌కుడు. ఇందులో శ‌ర్వా స‌ర‌స‌న‌ మాళవిక నాయర్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే 37వ ప్రాజెక్ట్‌ని ‘సామజవరగమన’ డైరెక్ట‌ర్‌ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు.అదీగాక ఈ రోజు త‌న పుట్టిన రోజు అయిన ఈ రోజే త‌న పాప పుట్టిందంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేయ‌గా నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది.

Updated : 6 March 2024 9:33 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top