సగానికి పడిపోయిన ఆదిపురుష్ కలెక్షన్స్.. నష్టాలు తప్పేలా లేవుగా..!
X
భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమా కు.. కలెక్షన్ల విషయంలో భారీ దెబ్బ తగిలింది. మొదటి నాలుగు రోజుల కలెక్షన్లు బాగా ఉన్నా.. సోమవారం నుంచి భారీగా డ్రాప్ అవుతున్నాయి. దీంతో సినిమా యూనిట్‌తో పాటు ట్రేడ్ వర్గాలను కలవర పడుతున్నాయి. మంగళవారం రోజు అన్ని భాషల్లో కలిపి కేవలం రూ. 10 కోట్లే రాబట్టింది. సినిమాకు వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా కలెక్షన్స్ భారీగా తగ్గాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి వీకెండ్ లోనే 70శాతం వసూళ్లు పడిపోవడంతో.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఏ రాష్ట్రంలోనూ సినిమా అంతగా ఆడట్లేదు. ప్రేక్షకులు రాకపోవడంతో స్క్రీన్లను మూసేస్తున్నారు. దీంతో మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆఫర్లు పెట్టి మరీ సినిమా టికెట్లను అమ్మె ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ (జూన్ 22), రేపు (జూన్ 23) సినిమా టికెట్ ను కేవలం రూ. 150కి అమ్ముతున్నట్లు ప్రకటించారు.
tollywood news, bollywood news, latest released movies, movie news, cinema news, entertainment news, latest news, telugu news, adipurush, Trade sources, Adipurush movie to break even, Adipurush collections