Vaddepalli Srinivas : తెలుగు సినీ పరిశ్రమలో విషాదం..స్టార్ సింగర్ కన్నుమూత
X
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ స్టార్ సింగర్ వడ్డేపల్లి శ్రీనివాస్ గురువారం ఉదయం కన్నుమూశారు. జానపద నేపథ్య గాయకుడిగా ఫేమస్ అయిన శ్రీనివాస్ ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. గబ్బర్ సింగ్ మూవీలో పాట పాడిన తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చారు. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన దాదాపు 100కు పైగా పాటలు పాడారు. అలాగే ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడి అభిమానులను సొంతం చేసుకున్నారు.
వడ్డేపల్లి శ్రీనివాస్ 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' మూవీలో 'గన్నులాంటి పిల్ల' పాటతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ పాటకు గాను ఆయనకు ఫిలింఫేర్ బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ మేల్ అవార్డు వచ్చింది. ఆ పాట తర్వాత వరుస అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది.
గత కొంతకాలంగా వడ్డేపల్లి శ్రీనివాస్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం ఆయన మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సంతాపం తెలియజేస్తున్నారు.