సినీ పరిశ్రమలో విషాదం..డైరెక్టర్ కన్నుమూత
X
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ షహానీ కన్నుమూశారు. కోల్‌కతాలో ఆయన మరణించినట్లు సమాచారం. కుమార్ షహాని మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. 83 ఏళ్ల కుమార్ షహానీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కోల్‌కతా లోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
డైరెక్టర్ కుమార్ కహానీ తెరకెక్కించిన మాయా దర్పన్, తరంగ్, ఖయల్ గాథ, కస్బా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలన్నీ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాయి. 1972లో తన మొదటి సినిమా మాయా దర్పణ్‌ను ఆయన తెరకెక్కించారు. ఆ తర్వాత తరంగ్ అనే మూవీ తీయడానికి ఆయనకు 12 ఏళ్లు పట్టింది. కుమార్ షహానీ 'ది షాక్ ఆఫ్ డిజైర్ అండ్ అదర్ ఎస్సేస్' అనే రచనలు కూడా చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.