ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం..'చిరుత' విలన్ కన్నుమూత
X
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. స్టార్ నటుడు డానియల్ బాలాజీ హార్ట్ ఎటాక్‌తో మృతిచెందారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. చిత్ర పరిశ్రమల్లో డానియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించాడు. తెలుగులో సాంబ, చిరుత, ఘర్షణ, టక్ జగదీశ్ లాంటి మూవీస్‌లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమిళ్‌లో అయితే స్టార్ నటులతో కలిసి పనిచేశారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కి డానియల్ బాలాజీ మంచి ఫ్రెండ్.
గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. 48 ఏళ్ల డానియల్ బాలాజీ సినిమాలపై ఇంట్రెస్ట్‌తో తారామణి ఫిల్మ్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారు. ఎప్పటికైనా మంచి డైరెక్టర్ కావాలనే డ్రీమ్‌తో ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఆయన కోరిక తీరకుండానే మరణించారు.
సినిమాల్లో కంటే సీరియల్స్‌లో ఎక్కువగా నటించిన ఆయన ఓ సీరియల్‌లో డానియల్ పాత్ర చేశారు. అప్పటి నుంచి తన పేరును డానియల్ బాలాజీగా మార్చుకున్నారు. చివరగా ఆయన తెలుగులో నేచురల్ స్టార్ నాని మూవీ 'టక్ జగదీష్'లో నటించారు. ఆయన మృతితో ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది. సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డానియల్ బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.