Dangal Actress : సినీ పరిశ్రమలో విషాదం.. 'దంగల్' నటి మృతి
X
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. నిజజీవిత కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ వసూళ్లను ఈ మూవీ రాబట్టింది. ఇకపోతే ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌తో పాటుగా ఆయన కూతుర్లుగా నటించిన ఫాతిమా, సన్యా, సుహాని భట్నాగర్ కూడా మంచి గుర్తింపును పొందారు. ఈ మూవీ తర్వాత వారికి మంచి ఆఫర్లు వచ్చాయి. అందులో ఫాతిమా, సన్యా ఆఫర్లను అందిపుచ్చుకుని ముందుకు సాగారు. సుహాని మాత్రం యాక్టింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చారు.
సుహాని తన స్టడీస్ కోసం సినిమాలను దూరం పెట్టారు. అయితే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్‌లోనూ ఉండేవారు. ఇన్‌స్టాలో తన ఫోటోలను షేర్ చేస్తూ చాలా విషయాలను పంచుకునేవారు. తాజాగా ఈ 19 ఏళ్ల అమ్మాయి సుహాని మరణించి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్నేళ్లకు ముందు సుహానికి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కాలుకు గాయం అయ్యింది. చికిత్స సమయంలో సుహాని కొన్ని మందులు తీసుకుంది. ఆ మందులే ఆమె ప్రాణాలు తీశాయి.
కాలుకు తగిలిన గాయం నయం అయ్యేందుకు ఆమె వాడిన మందులు సైడ్ ఎఫెక్ట్ ఇచ్చాయి. ఆ మందులు సుహానిపై దుష్ప్రభావం చూపాయి. దీంతో సుహాని శరీరంలో నెమ్మదిగా ద్రవం పేరుకుపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అయితే అక్కడ వైద్యం చేయించుకున్నా లాభం లేకుండా పోయింది. 19 ఏళ్లకే ఆమె మరణించడంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆమె మృతికి పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.