Home > సినిమా > సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
X

సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ కన్నుమూశారు. చెన్నైలో ఆయన మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు. కన్నడ, తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలల్లో చాలా సినిమాలకు విజయ్ ఆనంద్ సంగీతం అందించారు. 71 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించినట్లుగా కుటుంబీకులు తెలిపారు.

విజయ్ ఆనంద్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు. ఇళయరాజా వంటి వారిపై సంగీత దర్శకునిగా పోటీనిచ్చారు. విజయ్ ఆనంద్ కన్నడ సినీ పరిశ్రమలో 100కు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఆయన శాసించారు. ఆనాటి కాలంలో కన్నడ, తమిళ సినీ పరిశ్రమల్లో ఆయన తిరుగులేని వ్యక్తిగా నిలిచారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'నాన్ అడిమై ఇల్లై' సినిమాకు విజయ్ సంగీతం అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ మూవీలోని 'ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్ దాన్' అనే పాట ఎంతో ఫేమస్ అయ్యింది. తమిళంలో 10 సినిమాలకు పైగానే విజయ్ ఆనంద్ మ్యూజిక్ అందించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.


Updated : 8 Feb 2024 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top