Poonam Kaur : త్రివిక్రమ్ పై హీరోయిన్ తీవ్ర విమర్శలు..అతనోక యూజ్లెస్
X
ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి విమర్శలు గుప్పించారు. అతనొక యూజ్లైస్ ఫెలో అని ఘూటు వ్యాఖ్యలు చేశారు. అత్తారింటికి దారేది సినిమాలో సింహం గడ్డం గీసుకోదు..నేను గీసుకుంటా డైలాగ్ చెప్పమంటే నేను ఇబ్బందిపడ్డా. దీంతో కామెడీగా చెప్పమంటే అలాగే చేశా అంటూ పవన్ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ఈ వీడియోకు పూనమ్ ఎక్స్‌లో స్పదింస్తూ త్రివిక్రమ్‌ను విమర్శించారు.
గతంలో గుంటూరు కారం కాపీ కథ అని ప్రచారం చేసిన వెబ్ సైట్ పోస్టుని షేర్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్) లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్రివిక్రమ్ ఏదిచేసినా చెల్లుతుంది. ఆయనను కొంత మంది ఇంకా గుడ్డిగా వెనకేసుకోస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. త్రివిక్రమ్ అప్పటి ప్రభుత్వం మద్దతుఉందని.. సాధారణ ప్రజా సమస్యలు పట్టింపులేని ప్రభుత్వం ఆయనకు మాత్రం హెల్ఫ్ చేసిందంటూ రాసుకొచ్చారు. పూనం కౌర్ ట్వీట్ అయితే వైరల్ అవుతోంది. పూనం కౌర్ వ్యాఖ్యలపై త్రివిక్రమ్ ఇంతవరకు స్పందించలేదు. గుంటూరు కారం కథను సులోచనా రాణి నవలలను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిచ్చారని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సులోచన రాణి నవల 'మీనా' ఆధారంగా ఆయన అ ఆ సినిమాని తెరకెక్కించారట. అప్పట్లో టైటిల్స్ లో సులోచన రాణి కి క్రెడిట్ ఇవ్వలేదు అని కేసు కూడా నమోదయిన సంగతి తెలిసిందే.